Black edition cars: ఆ రంగు కార్లకు అదిరే డిమాండ్.. అన్ని కంపెనీల నుంచి స్పెషల్ ఎడిషన్లు విడుదల

|

Mar 19, 2025 | 3:45 PM

కారును కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ అనేక అంశాలను పరిశీలిస్తారు. ఇంజిన్, మైలేజీ, ఫీచర్లు తదితర వాటితో పాటు రంగుకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. ప్రస్తుతం మార్కెట్ లోకి అనేక రంగుల కార్లు విడుదలవుతున్నాయి. వాటిపై చాలామంది ఆసక్తి చూపుతున్పటికీ బ్లాక్ రంగు కార్లకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. దీనితో పాటు ముదురు రంగు వాహనాలనూ కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో మన దేశ మార్కెట్ లో నలుపు, ముదురు రంగుతో ఆకట్టుకుంటున్న వివిధ కంపెనీల కార్ల గురించి తెలుసుకుందాం.

1 / 5
హ్యుందాయ్ ఎక్స్ టర్ నైట్ ఎడిషన్ 2024లో విడుదలైంది. ఈ ఎస్ యూవీకి లోపలా, బయటా ఆకట్టుకునే బ్లాక్ అవుట్ ట్రీట్ మెంట్ చేశారు. దీనిలో బ్లాక్ అవుట్ బ్యాడ్జిలు, అల్లాయ్ వీల్స్, ముందు వెనుక స్కిడ్ ప్లేట్లు, డ్యాష్ బోర్డు, సీట్లు బాగున్నాయి. వీటితో పాటు ఎరువు రంగు బ్రేక్ కాలిపర్లు, గ్రిల్ టిమ్, ఏసీ వెంట్ హైలైట్లు, సిట్ పైపింగ్ ఉన్నాయి. ఈ నైట్ ఎడిషన్ బహుళ రంగుల ఎంపికల్లో లభిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్ టర్ నైట్ ఎడిషన్ ధర రూ.8.46 లక్షల నుంచి రూ.10.50 లక్షల వరకూ ఉంది.

2 / 5
హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ నల్లటి బాహ్య, అంతర్గత భాగాలతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. అలాగే గ్రిల్, స్టీరింగ్ వీల్, ఏసీ వెంట్లపై రాగి రంగు యాక్సెంట్  బాగుంది. హై స్పెక్ ఎస్ (ఓ), ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిలోని ఎస్ఎక్స్ (ఓ) నైట్ ఎడిషన్ లో ప్రత్యేక మైన డ్యూయల్ కెమెరా డాష్ క్యామ్ ఏర్పాటు చేశారు. ఈ కారు ధర రూ.10.35 లక్షల నుంచి రూ.13.57 లక్షల వరకూ పలుకుతోంది.

3 / 5
కామెట్ కంపెనీ నుంచి విడుదలైన ఈవీ బ్లాక్ స్ట్రోమ్ ముదురు రంగుతో ఆకర్షణీయంగా ఉంది. దీని ధర సాధారణ మోడల్ కన్నా రూ.30 వేలు ఎక్కువ. బ్యాటరీని సర్వీస్ గా ఉపయోగిస్తే రూ.7.8 లక్షల నుంచి మొదలవుతుంది. బీఏఏఎస్ ను ఎంపిక చేసుకోకపోతే రూ.9.81 లక్షలు పలుకుతుంది. అల్లాయ్ వీల్స్, బానెట్ బ్రాండింగ్, ఫాగ్ లాంప్ గార్నిష్, స్కిడ్ ప్లేట్లు, బాడీ మోల్టింగ్ అంతా ఎరుపు హైలైట్ల స్ల్పాష్ లతో పూర్తిగా నల్లటి బయటి భాగం ఆకట్టుకుంటోంది. దీనిలో 17.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 230 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

4 / 5
టాటా కంపెనీ విడుదల చేసిన ఆల్ట్రోజ్ డార్క్ ఎడిషన్ ఎంతో ఆకట్టుకుంటోంది. దీనిలో పూర్తి నలుపు రంగు బాహ్య, అంతర్గత భాగాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. బ్లాక్ గ్రిల్, అల్లాయ్ వీల్స్, క్యాబిన్ థీమ్, సిట్ అప్హల్ట్సరీ బాగున్నాయి. గ్రిల్, టెయిల్ గేట్ పై డార్క్ క్రోమ్ ఎలిమెంట్స్, ఫ్రంట్ ఫెండర్ పై డార్క్ ఎడిషన్ బ్యాడ్జీ, సీట్ బ్యాక్ రెస్ట్ లపై ఎంబోస్ట్ డార్క్ బ్రాండింగ్ ఆకర్షణీయంగా ఉన్నాయి.  ఆల్ట్రోజ్ డార్క్ ఎడిషన్ ఎక్స్ జెడ్ ప్లస్ ఎస్, ఎక్స్ జెడ్ ప్లస్ ఎస్ లక్స్ వేరియంట్లలో పెట్రోలు, డీజిల్ పవర్ ట్రెయిన్ ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.9.50 లక్షల నుంచి రూ. 11 లక్షల వరకూ పలుకుతోంది.

5 / 5
టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ ధర రూ.11.70 లక్షల నుంచి రూ.15.60 లక్షల వరకూ పలుకుతోంది. క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్, క్రియేటివ్ ప్లస్ ఎస్, ఫియర్ లెస్, ఫియర్ లెస్ ప్లస్ ఎస్ అనే వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిలో నలుపు రంగు బాహ్య, అంటీరియల్ థీమ్ ఆకట్టుకుంటున్నాయి. ఫ్రంట్ ఫెండర్లపై ఏర్పాటు చేసిన డార్క్ ఎడిషన్ బ్యాడ్జీలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.