బెంగుళూరు చెందిన ప్రముఖ ఈవీ కంపెనీ మధ్యతరగతి వాళ్లే అసలు టార్గెట్ ఓలా ఎస్ 1 ఎక్స్ పేరుతో ఈవీ స్కూటర్ అందుబాటులో ఉంచింది. ఈ స్కూటర్ ధర రూ.90,000 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ 2 కేడబ్ల్యూహెచ్, 3 కేడబ్ల్యూహెచ్ అనే రెండు బ్యాటరీల ఎంపికతో వస్తుంది. ఈ స్కూటర్ గంటకు 90 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అలాగే ఓ సారి చార్జ్ చేస్తే 91 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. 3.5 అంగుళాల సెగ్మెంటెడ్ డిస్‌ప్లేతో వచ్చే ఈ స్కూటర్ అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈవీ స్టార్టప్ కంపెనీ బౌన్స్ రిమూవబుల్ బ్యాటరీ సౌలభ్యంతో ఇన్‌ఫినిటీ స్కూటర్‌ను అందుబాటులో ఉంచింది. ఈ స్కూటర్ ధర రూ.83,886 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ రెండు కిలో వాట్ల లిథియం అయాన్ బ్యాటరీ నుంచి శక్తిని పొందుతుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటలకు 65 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అలాగే ఓ సారి చార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ముఖ్యంగా ఈ స్కూటర్‌లో వచ్చే డ్రాగ్ మోడ్ ఆప్షన్ అనుకోని పరిస్థితుల్లో స్కూటర్ పంక్చర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఒకినోవా ఆటోటెక్ కంపెనీలకు చెందిన ఒకినోవా ప్రైజ్ ప్రో ఈవీ స్కూటర్ ధర రూ.99,645(ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ మూడు సంవత్సరాల వారెంటీతో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 56 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అలాగే ఈ స్కూటర్ ఓ సారి చార్జ్ చేస్తే 81 కిలో మీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. ఎనిమిది రంగుల్లో అందుబాటులో ఉండే ఈ స్కూటర్ ఈవీ స్కూటర్ ప్రియులను అమితంగా ఆకర్షిస్తుంది.
రూ.90,000 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉండే అంపీయర్ జీల్ ఈఎక్స్ 60 వాట్స్, 2.3కేడబ్ల్యూహెచ్ అధునాతన లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్ గంటకు 55 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అలాగే ఓ సారి చార్జ్ చేస్తే 100 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది.
లెక్ట్రిక్స్ ఎల్‌ఎక్స్‌ఎస్ 2.0, 3.0 ఈవీ స్కూటర్లు కూడా రూ.లక్ష లోపు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఫీచర్లే ఈ స్కూటర్ల బలమని కంపెనీ చెబుతుంది. 36 సెఫ్టీ ఫీచర్లు, 24 స్మార్ట్ ఫీచర్లు, 14 కంఫర్ట్ ఫీచర్లతో ఈ స్కూటర్ ఆకర్షణీయంగా ఉంటుంది. 2.3 కేడబ్ల్యూహెచ్, 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎంపికలతో వచ్చే ఈ స్కూటర్లు గంటకు 100 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతాయి.