
తమ కూతురు భవిష్యత్ కోసం డబ్బులు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు కేంద్రం ప్రభుత్వం అందించే గొప్ప పథకం సుకన్య సమృద్ది యోజన. దేశంలో బాగా పాపులర్ అయిన స్కీమ్ ఉంది. కోట్లాది మంది తమ కూతురు పేరుపై ఈ అకౌంట్ తెరిచి పెట్టుబడులు పెడుతున్నారు. కూతురు పుట్టగానే ఈ ఖాతా ఓపెన్ చేయడం ద్వారా లాభం జరుగుతుంది. పెద్దయ్యాక వారి ఉన్నత చదువులు, పెళ్లికి పొదుపు చేసిన డబ్బులు ఉపయోగపడతాయి. అమ్మాయికి 18 ఏళ్లు నిండాక సుకన్య సమృద్ది యోజన ఖాతాలోని సొమ్ము విత్ డ్రా చేసుకోవచ్చా? అనే ప్రశ్నకు సమాధానం చూద్దాం.

సుకన్య సమృద్ది యోజన ఖాతాలోని సొమ్మును అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత తీసుకోవచ్చు. 10వ తరగతి పూర్తయిన తర్వాత కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ రెండింటిల్లో ఏది ముందు జరిగితే దాని ప్రకారం నిధుల్లో కొంతమొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ పూర్తి అమౌంట్ తీసుకోవడానికి కుదరదు. గత ఆర్ధిక సంవత్సరం వరకు అకౌంట్లో ఉన్న నిల్వలో 50 శాతం వరకు తీసుకునేందుకు వీలుంది.

నగదును విత్ డ్రా చేసుకోవాలంటే ఏదైనా ధృవీకరణ పత్రం అందించాలి. విద్యాసంస్థ జారీ చేసే ఫీజు రసీదు, అడ్మిషన్ తీసుకున్నట్లు ఏదైనా ఆధారాన్ని సమర్పించాలి. వీటిని సమర్పించి పాక్షికంగా సుకన్య సమృద్ది యోజన ఖాతాలోని సొమ్ము ఉపసంహరించుకోవచ్చు. అయితే పూర్తి సొమ్ము ఎప్పుడు తీసుకోవచ్చనే నిబంధనలు కొన్ని చూద్దాం.

అమ్మాయి పేరుపై ఖాతా తెరిచిన దగ్గర నుంచి 21 ఏళ్లు పూర్తి చేసిన తర్వాత మెచ్యూరిటీ పూర్తవుతుంది. అప్పుడు మొత్తం సొమ్మును ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన సొమ్ముతో పాటు వడ్డీతో సహా మొత్తం తీసుకోవచ్చు. అయితే కొన్ని సమయాల్లో 21 ఏళ్ల కంటే ముందే అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. అమ్మాయికి 18 ఏళ్లు దాటి పెళ్లి చేసుకుంటే ఖాతా క్లోజ్ చేసుకోవచ్చు.

వివాహానికి ఒక నెల ముందు లేదా వివాహాం అయిన మూడు నెలల తర్వాత ఖాతాను క్లో్జ్ చేసుకోవచ్చు. తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టేముందు ఈ నియమాలను ముందే తెలుసుకోవాలి. దీని వల్ల ఆర్దికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొంతమంది తల్లిదండ్రులు ఈ నియమాలు తెలుసుకోకుండా పెట్టుబడి పెడతారు. దీని వల్ల సమస్యలు ఎదురుకావొచ్చు