Subhash Goud |
Oct 23, 2021 | 12:20 PM
Smartphones Sales: ప్రస్తుతం ఆన్‌లైన్‌లో, మార్కెట్లో ఆఫర్లు ఉన్నాయంటే అది స్మార్ట్‌ఫోన్‌లో అని చెప్పాలి. ఆ తర్వాత మిగతా వాటికి ఆఫర్లు ఉంటాయి. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్ వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది.
ఈ ఏడాది దసరా, దీపావళి సీజన్‌లో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 760 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 56,858 కోట్లు) స్థాయిలో నమోదు కావచ్చని మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ అంచనా వేసింది.
అంతేకాదు, ఈ పండగ సీజన్‌లో అమ్ముడయ్యే స్మార్ట్‌ఫోన్ల సరాసరి ధర కూడా 14 శాతం పెరిగి ఆల్‌టైం గరిష్ఠ స్థాయి 230 డాలర్ల (రూ.17,200)కు చేరుకోవచ్చని అంటోంది.
ప్రస్తుతం మార్కె ట్లో మిడ్, ప్రీమియం ఫోన్లకు అధిక డిమాండ్ ఉంది. రికార్డు విక్రయాలకు ఇది దోహదపడనుందని పేర్కొంది.