
ఎండాకాలం రావడంతో విద్యుత్ వినియోగం ప్రతీ ఇంట్లో సాధారణంగా పెరుగుతూ ఉంటుంది. వేడి నుంచి తట్టుకునేందుకు ఇంట్లో కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు ఎక్కువగా వాడుతూ ఉంటారు. 24 గంటలు ఆన్ చేసే ఉంచుతారు. దీంతో కరెంట్ బిల్లు వేసవికాలంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే సమ్మర్‌లో కొన్ని చిట్కాల వల్ల కరెంట్ బిల్లు తగ్గించుకోవచ్చు. అవేంటి అనేది ఇందులో చూద్దాం

మీరు ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించే సమయంలో పవర్ సేవింగ్ సెట్టింగ్స్ ఆన్ చేయండి. టీవీ, ఏసీ, కంప్యూటర్లలో పవర్ సేవింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఆన్ చేయడం వల్ల మీరు వాటిని వాడనప్పుడు కరెంట్ ఆదా అవుతుంది. దీని వల్ల కరెంట్ వినియోగం తగ్గడం వల్ల బిల్లు తక్కువగా వస్తుందన్నమాట. ఇక 5 స్టార్ రేటింగ్ కలిగిన కరెంట్‌ను తక్కువగా వాడే పరికరాలను కొనుగోలు చేయండి.

ఇక ఇంట్లో ఎల్‌ఈడీ బల్బులను మాత్రమే వాడండి. ఎందుకంటే ఇవి కరెంట్‌ను చాలా తక్కువగా వినియోగిస్తాయి. వీటి ధర కాస్త అధికంగా ఉన్నా.. మీకు కరెంట్ బిల్లును తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో ఇన్కాండసెంట్, సీఎఫ్‌ఎల్ బల్బులను పక్కనపెట్టి ఎల్‌ఈడీ లైట్లను మాత్రమే ఇంట్లో వాడండి. ఇలా చేయడం వల్ల మీకు విద్యుత్ బిల్లు తగ్గుతుంది.

ఎల్‌ఈడీ బల్బుల వల్ల దాదాపు 80 శాతం వరకు విద్యుత్ వినియోగం తగ్గుతుంది. అలాగే ఇంట్లో ఏసీ వాడుతుంటే.. టెంపరేచర్ 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచండి. ఇక ఎయిర్ ఫిల్టర్లను నెలకోసారి తప్పనిసరిగా బయటకు తీసి కడగాలి. కడిగిన తర్వాత ఆరబెట్టి మళ్లీ బిగించాలి. ఇక సీలింగ్ ఫ్యాన్ ఉంటే వేగంగా మాత్రమే వాడాలి.

ఇక ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం వాడినప్పుడు అవసరం లేనప్పుడు అన్ ప్లగ్ చేయండి. ప్లగ్‌లో ఉంచడం వల్ల విద్యుత్ ఖర్చవుతుంది. దీంతో పని పూర్తయ్యాక తప్పనిసరిగా అన్ ప్లగ్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఉదయం కిటికీలు తెరవడం వల్ల ఎండ ఇంట్లో పడితే ఫ్యాన్ల వినియోగం తగ్గుతుంది.