Indian Railways: ఆన్‌లైన్ రైల్వే టికెట్ల బుకింగ్ సేవలు బంద్.. రైల్వేశాఖ నుంచి కీలక ప్రకటన.. ఈ రోజుల్లోనే..

Updated on: Mar 23, 2026 | 7:27 PM

రైల్వే టికెట్ల బుకింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌లో మార్పులు చేయాల్సి ఉండటం వల్ల ఆన్ లైన్ సేవలు ఆగిపోనున్నాయి. మార్చి 26 నుంచి 27వ తేదీ ఉదయం వరకు సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ ప్రకటన జారీ చేసింది.

1 / 5
రైల్వే టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? అయితే మీకు పెద్ద అలర్ట్. ఎందుకంటే రైల్వే టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. బుకింగ్‌లు మాత్రమే కాకుండా క్యాన్సిలేషన్, ఎంక్వైరీ సేవలు ఆగిపోతున్నాయి. మార్చి 26,27వ తేదీల్లో ఆన్ లైన్ రిజర్వేషన్ సేవలకు అంతరాయం కలగనుంది. ఇక పీఎన్‌ఆర్ చెకింగ్ సేవలు కూడా బంద్ కానున్నాయని రైల్వేశాఖ చెబుతోంది.

2 / 5
నిర్వహణ పనుల కారణంగా ఢిల్లీ డివిజన్ పరిధిలో ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. మార్చి 26న రాత్రి 11.45 గంటల నుంచి మార్చి 27 ఉదయం 4.45 గంటల వరకు ఆన్ లైన్ సేవలు బంద్ కానున్నాయి. సుమారు ఐదు గంటల పాటు సేవలు నిలిచిపోతాయి.

3 / 5
ఈ సమయంలో ముఖ్యమైన టికెట్ల బుకింగ్, రద్దు, పీఎన్ఆర్ స్టేటస్, ఎంక్వైరీ వంటి సేవలు పనిచేయవు. దీంతో వినియోగదారులు ముందుగానే ఈ పనులు చేసుకోవాలని రైల్వేశాఖ సూచించింది. ఇక టికెట్ల కౌంటర్లలో కూడా ఈ సేవలను నిలిపివేయనున్నారు. ఇక ఛార్టింగ్, ఈడీఆర్ సేవలు కూడా మీరు పొందలేరు.

4 / 5
ఇక తత్కాల్ బుకింగ్స్‌పై కూడా ఈ ప్రభావం పడుతుందని రైల్వేశాఖ చెబుతోంది. రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ వేగాన్ని పెంచేందుకు రైల్వేశాఖ మెరుగుపరుస్తోంది. దీని వల్ల అసౌకర్యాన్ని ప్రయాణికులు గమనించాలని, ముందుగానే సేవలను పొందాలని సూచించింది. మార్చి 26న రాత్రి 11.45 గంటల్లోపు పనులన్నీ పూర్తి చేసుకోవాలని వెల్లడించింది.

5 / 5
కాగా ప్రస్తుతం ఉన్న ప్యాసిండర్ రిజర్వేషన్ సిస్టమ్ అనేది 40 ఏళ్ల నాటిది. దీని స్థానంలో హైస్పీడ్ సిస్టమ్‌ను తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. కొత్త రిజర్వేషన్ సిస్టమ్‌లో బుకింగ్స్ మరింత వేగవంతంగా జరగనున్నాయి. అలాగే ఇతర సేవలను వేగంగా యాక్సెస్ చేయవచ్చు.

Follow Us