
RD పథకం ఎలా ఉంటుంది..? : ఈ పథకంలో ప్రతి నెలా ఒక చిన్న మొత్తాన్ని జమ చేయడం. మీరు ఈ డబ్బును వరుసగా 5 సంవత్సరాలు కడతారు. దీనికి పోస్ట్ ఆఫీస్ మీకు వడ్డీ ఇస్తుంది. వడ్డీ కూడా మీ డబ్బుకు కలుస్తూ పోవడం వలన, మీ పొదుపు చాలా వేగంగా పెరుగుతుంది. ఈ పథకంలో వడ్డీపై వడ్డీ రావడం విశేషం.

ఎంత పొందుతారు?: మీరు ప్రతి నెలా రూ.15,000 డిపాజిట్ చేస్తే.. 5 ఏళ్లలో మీరు మొత్తం రూ.9 లక్షలు జమ అవుతుంది. ప్రస్తుతం ఉన్న 6.7శాతం వడ్డీ రేటుతో, మీకు సుమారు రూ.1.7 లక్షల వడ్డీ వస్తుంది. మొత్తంగా, 5 సంవత్సరాల తర్వాత మీకు రూ.10.7 లక్షలు వస్తాయి.

ఈ స్కీమ్ ఎందుకు బెస్ట్..?: పోస్ట్ ఆఫీస్ RD పథకానికి భారత ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. దీని అర్థం . కాబట్టి, మార్కెట్లో నష్టాలు వచ్చినా, మీ డబ్బుకు ఏమీ కాదు. ఇది చాలా సురక్షితమైన పెట్టుబడి. రిస్క్ లేని పెట్టుబడిని కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.

ఈ పథకంలో వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. ప్రస్తుతం 6.7 వార్షిక వడ్డీ లభిస్తుంది. కాబట్టి 5 సంవత్సరాల తర్వాత మీకు ఎంత వస్తుందో మీకు ముందే తెలుస్తుంది. ఆర్‌డి పథకంలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. మీరు మీ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి ఖాతాను తెరవవచ్చు.

ప్రధానంగా ఈ పథకం పన్ను ఆదా ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మీరు మీ భవిష్యత్తు కోసం సురక్షితమైన, మంచి పెట్టుబడి కోసం చూస్తున్నట్లయితే, ఈ పోస్ట్ ఆఫీస్ RD పథకం ఖచ్చితంగా మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. చిన్న పొదును ఇది ఒక పెద్ద నిధిగా మారుస్తుంది.