Festival Bonanza Offer: మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? పండగ సీజన్‌లో బంపర్‌ ఆఫర్‌..!

|

Sep 17, 2021 | 1:47 PM

Festival Bonanza Offer: పండగ సీజన్‌లో బ్యాంకులు వినియోగదారులకు బంపర్‌ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఎస్‌బీఐతో పాటు ఇతర బ్యాంకులు హోమ్‌ లోన్స్‌పై వడ్డీ రేట్లను..

1 / 5
Festival Bonanza Offer: మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? పండగ సీజన్‌లో బంపర్‌ ఆఫర్‌..! Festival Bonanza Offer: పండగ సీజన్‌లో బ్యాంకులు వినియోగదారులకు బంపర్‌ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఎస్‌బీఐతో పాటు ఇతర బ్యాంకులు హోమ్‌ లోన్స్‌పై వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) తన వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

2 / 5
కస్టమర్ల కోసం ఫెస్టివల్‌ బొనాంజా ఆఫర్‌ను ప్రకటించింది. పండగ ఆఫర్‌ కింద గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, కారు లోన్స్‌, పెన్షన్‌ రుణాలను, బంగారు రుణాలు అందిస్తోంది. అయితే వీటన్నింటికి సర్వీస్‌ ఛార్జీలు, ప్రాసెసింగ్‌ ఫీజు, డాక్యుమెంటేషన్‌  ఛార్జీలను మినహాయిస్తున్నట్లు ప్రకటించింది.

3 / 5
పీఎన్‌బీ సరసమైన వడ్డీ రేట్లపై రుణాలను అందిస్తోంది. గృహ రుణాలపై 6.80 శాతం, కారు రుణాలపై 7.15 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. పండగ సీజన్‌లో కస్టమర్లకు మరింత మేలు చేకూర్చే విధంగా ఛార్జీల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

4 / 5
ఇక సాధారణ ప్రజలకు 8.95 శాతం చొప్పున వ్యక్తిగత రుణాలను కూడా అందిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న పీఎన్‌బీ తన కస్టమర్లకు రుణాలలో ఈ సర్వీస్‌ ఛార్జ్‌, ప్రాసెసింగ్‌ ఫీజులను మినహాయిస్తున్నట్లు తెలిపింది.

5 / 5
ఇక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కోటక్‌ మహీంద్రా బ్యాంకులు కూడా పండగ సీజన్‌లో కస్టమర్లకు వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ ప్రకటించాయి. పండగ సీజన్‌ వస్తుండటంతో రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి.