
PM Kisan: దేశవ్యాప్తంగా రైతులు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 21వ విడత రూ.2,000 కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది రైతులు ఇప్పటికే ఈ విడతను అందుకున్నారు. అయితే అందుకున్నది కొన్ని రాష్ట్రాలు మాత్రమే. ఇటీవల వచ్చిన వరదల కారణంగా పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో 21వ విడతను అందించింది కేంద్రం. ఈ మూడు రాష్ట్రాల్లో కేద్రం దాదాపు 2.7 మిలియన్ల మంది రైతులకు రూ.2000 అందించింది.

ఈ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయోనని దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎదరు చూస్తున్నారు. ఇప్పటి వరకు 20వ విడత రైతులు అందుకున్నారు. ఇప్పుడు 21వ విడత రానుంది.

మీడియా నివేదికల ప్రకారం.. 21వ విడత దీపావళికి ముందు రైతుల ఖాతాలకు రూ. 2,000 బదిలీ చేయబడవచ్చు. ఈ విడత అక్టోబర్ చివరి వారం నాటికి చేరుతుందని భావిస్తున్నారు. అయతే కేంద్రం మాత్రం తదుపరి విడతకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

వీరికి ఈ విడత రాదు: మీరు PM కిసాన్ యోజన కింద మీ e-KYCని ఇంకా పూర్తి చేయకపోతే మీ డబ్బు రాకపోవచ్చు. e-KYC లేకుండా ఎటువంటి వాయిదాలు బదిలీ చేయబడవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంకా, మీ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయకపోతే డబ్బు బదిలీ కావని గుర్తించుకోండి.

మీ బ్యాంక్ వివరాలలో తప్పు IFSC కోడ్, ఖాతా వాడుకలో ఉండకపోవడం లేదా మీ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయకపోవడం వంటి ఏవైనా తేడాలు ఉంటే వాయిదాల డబ్బు మీ ఖాతాకు జమ కాదు. మీ బ్యాంక్ వివరాలను క్రాస్-చెక్ చేసుకోండి. మీకు ఏవైనా లోపాలు కనిపిస్తే, వాటిని వెంటనే అప్‌డేట్ చేయండి.