
భారతదేశంలో సగానికి పైగా జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే, ఈ రైతులకు ప్రకృతి, వాతావరణ నష్టాల నుంచి పంటలను కాపాడుకునేందుకు, మార్కెట్‌కు తరలించేందుకు ఇప్పటికీ మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవు. ఈ క్రమంలో రైతులకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ FPO (Farmer Producer Organization Scheme) స్కీమ్‌తో ముందుకు వచ్చింది. ఈ పథకం కింద, 11 మంది రైతుల సమూహం (గ్రూప్) అంటే.. రైతు ఉత్పత్తిదారు సంస్థ (FPO / FPC) వ్యవసాయానికి సంబంధించిన అన్ని వ్యాపార మౌలిక సదుపాయాల కోసం రూ. 15 లక్షల సహాయం అందింస్తుంది.

రైతులను ఆత్మనిర్భర్ (స్వావలంబన) గా మార్చడంతోపాటు ఆర్థిక సంక్షోభం నుంచి వారికి ఉపశమనం కలిగించడమే పీఎం కిసాన్ ఎఫ్‌పీఓ పథకం లక్ష్యం. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి, రైతులు కలిసి ఒక సంస్థ లేదా కంపెనీని (FPO) ఏర్పాటు చేసుకోవాలి. అందులో కనీసం 11 మంది రైతులు ఉండాలి. FPO అనేది రైతుల కోసం పనిచేసే రైతులు, ఉత్పత్తిదారుల ఒక రకమైన సమగ్ర సంస్థ అని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ లక్ష్యం ఏంటో సమగ్రంగా తెలుసుకోండి..

రైతుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం 203-24 వరకు 10,000 FPOలను ఏర్పాటు చేయడం.

రైతుల ఉత్పాదకత పెరగడానికి, మార్కెట్ నుంచి సరైన రాబడిని పొందడానికి అత్యవసర, సమగ్ర చర్యలు తీసుకోవడం

5 సంవత్సరాల వరకు ప్రభుత్వం వైపు నుంచి కొత్త FPOకి హ్యాండ్ హోల్డింగ్, సపోర్ట్ అందించడం.

ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు రైతులలో వ్యవసాయ-వ్యవసాయ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం కేంద్రం లక్ష్యం..

ఎలా దరఖాస్తు చేయాలో తెలుసా?.. మీరు ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే మీరు భారత ప్రభుత్వ జాతీయ వ్యవసాయ మార్కెట్ (https://www.enam.gov.in) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆ తర్వాత మీరు FPO ఎంపిక పేజీని ఓపెన్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా కొత్త పేజీ రిజిస్ట్రేషన్ లేదా లాగిన్‌తో కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం సమాచారాన్ని పూరించడం ద్వారా ఈ పథకం ప్రయోజనాన్ని సులభంగా పొందవచ్చు.