
భారతదేశంలో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఇల్లు ఎవరిది అని ప్రశ్న అడిగితే అప్పుడు పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి చెందిన యాంటెలియా ఇల్లు కళ్ల ముందు నిలుస్తుంది. 27 అంతస్తుల ఈ ఇంటి ఖరీదు 12 వేల కోట్లకు పైగానే.

రెండోది పారిశ్రామికవేత్త గౌతం సింఘానియా ఇల్లు. రేమండ్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియాకు చెందిన 30 అంతస్తుల ఇల్లు. దీని ధర దాదాపు 6000 కోట్లు.

ముకేశ్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ ఇల్లు భారతదేశంలోనే మూడవ అత్యంత ఖరీదైన ఇల్లు. ఈ ఇంటి పేరు ఎబోద్. 17 అంతస్తుల ఈ ఇంటి ధర ఐదు వేల కోట్లు.

ముఖేష్ అంబానీకి కుడిభుజంగా భావించే మనోజ్ మోడీకి కూడా విలాసవంతమైన ఇల్లు ఉంది. దీని ఖరీదు ఒకటిన్నర వేల కోట్లు. మనోజ్ మోడీ ఇల్లు బృందావనం భారతదేశంలోని నాల్గవ అత్యంత ఖరీదైన ఇల్లు.

వ్యాపారవేత్త సైరస్ పూనావాలాకు కూడా విలాసవంతమైన ఇల్లు ఉంది. ఆయన ఇల్లు లింకన్ హౌస్ ఖరీదు 750 కోట్లు.