Gas Cylinder: ఎల్‌పీజీ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై సిలిండర్ బుకింగ్ ఎక్కడ నుంచైనా చేయొచ్చు.!

|

Jul 17, 2021 | 3:39 PM

Gas Cylinder Booking: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు దేశంలోని మూడు ప్రభుత్వ సంస్థలైన హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ గుడ్ న్యూస్ అందించాయి.

1 / 4
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు దేశంలోని మూడు ప్రభుత్వ సంస్థలైన హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ గుడ్ న్యూస్ అందించాయి. ఇకపై వినియోగదారులు ఏ ఏజెన్సీ నుంచైనా ఎల్పిజి రీఫిల్ పొందవచ్చు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఈ సౌకర్యం ప్రస్తుతం గుర్గావ్, పూణే, రాంచీ, చండీఘర్‌, కోయంబత్తూర్‌లలో అందుబాటులో ఉంది.

2 / 4
కస్టమర్లు తమ మొబైల్ యాప్ లేదా పోర్టల్ ద్వారా ఎల్‌పీజీ రీఫిల్‌ను బుక్ చేసేటప్పుడు, వారికి దగ్గరలోని డిస్ట్రిబ్యూటర్ల లిస్టును చూడవచ్చు. ఆ జాబితా నుంచి పంపిణీదారులలో ఎవరినైనా కూడా ఎంచుకోవచ్చు. ఈ సేవ పంపిణీదారుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని తీసుకురావడమే కాకుండా.. పెర్ఫార్మన్స్ రేటింగ్స్‌ను కూడా పెంచుకోవడంలో దోహదపడుతుంది.

3 / 4
చమురు కంపెనీలు వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా ఎల్‌పీజీ కనెక్షన్‌ను ఆన్‌లైన్‌లో బదిలీ చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ లాగిన్‌ను ఉపయోగించి తమ ప్రాంతంలోని పంపిణీదారుల జాబితా నుండి OMC పంపిణీదారుని ఎంచుకోవచ్చు.

4 / 4
 తద్వారా తమ ఎల్‌పీజీ కనెక్షన్‌ను పోర్ట్ చేసే ఆప్షన్‌ను కస్టమర్లకు ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఈ సదుపాయం పూర్తిగా ఉచితం. ఎలాంటి ఛార్జీలు పడవు. మే 2021 నాటికి, 55,759 పోర్టబిలిటీ అభ్యర్థనలు OMCలు విజయవంతంగా నెరవేర్చారు.