
ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి బిగ్ అలర్ట్. గ్యాస్ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ రోజు, రేపు మాత్రమే గడువు ఉంది. ఆగస్ట్ 31కల్లా కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. రేపటితో గడువు ముగియనున్న క్రమంలో ఇంకా పూర్తి చేయనివారు వెంటనే కేవైసీ ప్రక్రియ కంప్లీట్ చేయాలి.

కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయకపోతే గ్యాస్ సబ్సిడీ కట్ అవ్వడంతో పాటు గ్యాస్ డెలివరీలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని తెలుస్తోంది. తొలుత ఆగస్ట్ 16వ తేదీ వరకు సమయం ఇవ్వగా.. ఆ తర్వాత ఆగస్ట్ 23 వరకు పొడిగించారు. అయితే కేవైసీ చేయడంలో సాంకేతిక సమస్యలు, సర్వర్ ఇష్యూలు రావడంతో ఆగస్ట్ 31 వరకు పొడిగించారు. ఇంకోసారి గడువు పొడిగించే ఛాన్స్ ఉండకపోవచ్చు

మీరు కనెక్షన్ తీసుకున్న గ్యాస్ కంపెనీకి సంబంధించిన సమీపంలోని కార్యాలయానికి వెళ్లి పూర్తి చేయవచ్చు. బయోమెట్రిక్ ద్వారా కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డు, గ్యాస్ పాస్ బుక్ తీసుకెళ్లాలి. మీ ఫేస్ లేదా ఫింగర్ ప్రింట్ ద్వారా కేవైసీ ప్రాసెస్ పూర్తి చేస్తారు. ఇక కస్టమర్లు ఆన్‌లైన్‌లో కూడా మొబైల్ ద్వారా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

మీ గ్యాస్ కంపెనీకి సంబంధించిన యాప్ లేదా వెబ్ సైట్ ఓపెన్ చేయండి. అందులో కేవైసీ ఆనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్ నమోదు చేయండి. అనంతరం ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ఓపెన్ చేయండి. యాప్ ద్వారా మీ ముఖం స్కాన్ చేయండి. అనంతరం సబ్మిట్ చేస్తే మీ గ్యాక్ ఈకేవైసీ పూర్తవుతుంది.

ఇప్పటికే గ్యా్స్ కేవైసీ పూర్తి చేసినవారు మరోసారి చేయాల్సిన పని లేదని గ్యాస్ కంపెనీలు చెబుతున్నారు. పూర్తి చేయనివారికి ఎస్‌ఎంఎస్ రూపంలో సమాచారం అందిస్తున్నారు. ఈమెయిల్స్ కూడా పంపిస్తున్నారు. గడువులోగా పూర్తి చేయకపోతే గ్యాస్ సబ్సిడీ కోల్పోతారని హెచ్చరిస్తున్నాయి. వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నాయి.