Amrit Bharat: త్వరలో మరో రెండు అమృత్ భారత్ రైళ్లు.. రైల్వే ప్రయాణికులకు సూపర్ న్యూస్.. ప్రారంభం ఎప్పుడంటే..?

Updated on: Feb 18, 2026 | 11:13 AM

రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. అమృత్ భారత స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే దేశ నలుమూలకు సామాన్య ప్రజల కోసం నాన్ ఏసీ కోచ్‌లతో ఈ రైళ్లను తీసుకురాగా.. ఇప్పుడు అమృత్ భాతర్ 3.0 వెర్షన్ రైళ్లను ప్రారంభించనుంది.

1 / 5
ప్రయాణికులకు రైల్వే శాఖ సూపర్ న్యూస్ అందించింది. రైల్వేశాఖ కొత్త రకం రైళ్లను తీసుకొస్తుంది. ఇప్పటికే సాధారణ వందే భారత్, వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లను కొత్తగా ప్రవేశపెట్టిన విషయం తెలిసింది. ఇటీవల బడ్జెట్‌లో బుల్లెట్ రైళ్ల కారిడార్లను ప్రకటించగా.. రానున్న రెండు, మూడు ఏళ్లల్లో హైస్పీడ్ బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

2 / 5
ఈ క్రమంలో అమృత్ భారత్ రైళ్లపై ఇండియన్ రైల్వే కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం అమృత్ భారత్ 1.0, 2.0 వెర్షన్ రైళ్లు నడుస్తోండగా.. అమృత్ భారత్ అప్‌గ్రేడ్ వెర్షన్ 3.0 ట్రైన్లు కూడా త్వరలో రానున్నాయి. ప్రస్తుతం ఉన్న  ఈ టైప్ రైళ్లల్లో కేవలం నాన్ ఏసీ కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. నాన్ ఏసీ జనరల్, స్లీపర్ కోచ్‌లతో సర్వీసులు అందిస్తున్నాయి.

3 / 5
త్వరలో రానున్న అమృత్ భారత్ 3.0 రైళ్లల్లో నాన్ ఏసీతో పాటు ఏసీ కోచ్‌లు కూడా ఉండనున్నాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉంటాయి. రైలు రెండు చివర్లలో లోకోమోటివ్‌లు ఉంటాయి. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ రెండు అమృత్ భారత్ థర్డ్ వెర్షన్ రైళ్లను తయారు చేస్తోంది.

4 / 5
ఏప్రిల్ నాటికి ఈ రెండు అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాన్ ఏసీ, ఏసీ కోచ్‌లు రెండూ ఈ రైళ్లల్లో ఉంటాయి.  రైళ్ల తయారీ పూర్తయిన తర్వాత రీసెర్చ్ డీజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్‌కు పంపుతారు. ఆ తర్వాత ట్రయల్స్, టెస్టులు నిర్వహిస్తారు.

5 / 5
అన్నీ అనుమతులు వచ్చాక రైళ్లను ప్రారంభించనున్నారు. మొత్తం 50 అమృత్ భారత్ 3.0 రైళ్లను ఉత్పత్తి చేసే బాధ్యతను చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీకి అప్పగించారు. కాగా జనవరి నాటికి దేశంలో 27 అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నాయి. తమిళనాడు నుంచి మూడు రైళ్లు సేవలు అందిస్తున్నాయి.

Follow Us