Indian Railways: ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు.. 30 నిమిషాల ముందు కూడా బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు.. ఎలానో చూడండి..

Updated on: Apr 05, 2026 | 7:59 AM

భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డింగ్ స్టేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు 24 గంటల ముందు మాత్రమే బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పటినుంచి మీరు 30 నిమిషాల ముందు కూడా మార్చుకోవచ్చు.. ఎలా అంటే..

1 / 5
రైల్వే ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్. బోర్డింగ్ స్టేషన్ రూల్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణికులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ట్రైన్ జర్నీ చేసేముందు ట్రైన్ మిస్ అవుతుందనే ఆందోళన అవసరం లేదు. ఇప్పటివరకు టికెట్ బుక్ చేసుకున్న స్టేషన్‌లో ట్రైన్ మిస్ అయితే ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. అయితే ఇక నుంచి అలాంటి ఇబ్బంది ఉండదు.

2 / 5
చివరి నిమిషంలో అయినా బోర్డింగ్ స్టేషన్ సులువుగా మార్చుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఆ రూల్స్ ఏంటంటే.. మీరు ట్రైన్ బయల్దేరడానికి 30 నిమిషాల ముందు వరకు బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు. మీకు ఆలస్యమవుతుందని అనుకుంటే బోర్డింగ్ పాయింట్ వెంటనే మార్చుకోవచ్చు. వీటి వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం.

3 / 5
గతంలో బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవాలంటే కొన్ని గంటల ముందు మాత్రమే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ప్రక్రియ మరింత సులభతరం అయింది. ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా ఈజీగా బోర్డింగ్ స్టేషన్ ఛేంజ్ చేసుకోవచ్చు. అలాగే  రిజర్వేషన్ల కౌంటర్ల ద్వారా కూడా మార్చుకునే అవకాశముంది. ఈ విషయాన్ని తెలుపుతూ దక్షిణ మధ్య రైల్వే ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది.

4 / 5
గతంలో ట్రైన్ బయల్దేరే సమయానికి 24 గంటల ముందు మాత్రమే బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే అవకాశం ఉంది. దీంతో ఫస్ట్ రిజర్వేషన్ ఛార్ట్‌లోనే బోర్డింగ్ స్టేషన్ వివరాలు పొందుపర్చేవారు. అయితే ఇప్పుడు 30 నిమిషాల ముందు మార్చుకునే సౌలభ్యం రావడం వల్ల రెండో రిజర్వేషన్ ఛార్ట్‌లో పేరు కనిపిస్తుంది.

5 / 5
అయితే బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. వ్యాలిడ్ కన్ఫార్మ్‌డ్ టికెట్, ఆర్ఏసీ టికెట్ ఉండాలి. వెయింట్ లిస్టులో ఉన్న టికెట్లకు అవకాశం అనేది ఉండదు. ఇక ఒకసారి మాత్రమే బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే అవకాశం ఉంటుంది. రెండో చార్ట్ ప్రిపేర్ అయ్యేలోపే మార్చుకోవాలి. ఐఆర్‌సీటీసీ యాప్, వెబ్ సైట్లోకి వెళ్లి మీ టికెట్‌ను సెలక్ట్ చేసుకుని మార్చుకోగానే మీకు అలర్ట్ మెస్సేజ్ వస్తుంది.

Follow Us