Plastic Currency: త్వరలోనే భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. అయ్యో.. ఒక్కొ నోటు తయారీకి అంత ఖర్చవుతుందా..?

Updated on: Jul 24, 2026 | 8:15 AM

ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరల పేపర్ నోట్ల స్థానంలో ప్లాస్లిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే పాలిమర్ షీట్ల కోసం బిడ్లను ఆహ్వానిస్తోంది. అంతర్జాతీయ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానిస్తోంది. త్వరలోనే నోట్ల ప్రింటింగ్ ప్రక్రియ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం అందుబాటులోకి తీసుకొస్తారు.

1 / 5
త్వరలో భారత్‌లో కరెన్సీ నోట్ల రూపం, రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. కొత్త కరెన్సీ నోట్లు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న  పేపర్ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ కసరత్తు ఇప్పటికే మొదలుపెట్టింది. ఈ మేరకు పాలిమర్ షీట్ల సేకరణ కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి టెండర్లను కూడా ఆహ్వానించింది. త్వరలోనే టెండర్ ఖరారు చేయనుండగా.. ఆ తర్వాత పాలిమర్ ప్లాస్టిక్ నోట్ల ప్రింటింగ్ స్టార్ట్ చేయనుంది. అనంతరం వాటిని చలామణిలోకి తీసుకురానుంది.

2 / 5
తొలుత రూ.10, రూ.20 నోట్లను పైలట్ ప్రాజెక్ట్ కింద వినియోగంలోకి తీసుకురానుండగా.. వాటికి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను బట్టి రూ.50, రూ.100, రూ.500 నోట్లను కూడా తీసుకురానుంది. వచ్చే ఏడాదిలో వీటిని లాంచ్ చేసే అవకాశముందని తెలుస్తోంది.  ప్రస్తుతం ఉన్న పేపర్ కరెన్సీ నోట్లను 100 శాతం కాటన్ ఆధారిత ప్రత్యేక పేపర్‌తో ఆర్బీఐ తయారుచేస్తోంది. అయితే ఇవి పేపర్‌తో తయారు చేసినవి కావడంతో త్వరలో చిరిగిపోవడం, తడిసిపోవడం, పాడైపోవడం, మురికిపట్టడం లాంటివి జరుగుతున్నాయి.

3 / 5
పేపర్ స్థానంలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టనున్నారు. ఈ నోట్లు ధృఢంగా, బలంగా ఉంటాయి. ఎక్కువకాలం పాటు అలాగే ఉంటాయి. చిరిగిపోయే, పాడైపోయే అవకాశం ఉండదు. నోట్లు తడిచినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎన్ని సంవత్సరాలు అయినా అలాగే ఉంటాయి. అయితే వీటి తయారీకి ఎంత ఖర్చు అవుతుందనే విషయం హాట్‌టాపిక్‌గా మారింది. పేపర్ నోట్ల కంటే వీటి తయారీ ఖర్చు ఎక్కువ అవుతుందట.

4 / 5
ప్రస్తుతం రూ.10 నోటు ప్రింటింగ్ ఖర్చు 70 పైసల నుంచి రూ.1.01 వరకు అవుతుండగా.. రూ.20 నోటు ముద్రణకు 95 పైసల నుంచి రూ.1 వరకు ఖర్చవుతుంది. కానీ ప్లాస్టిక్ నోట్ల తయారీకి ఎక్కువగా ఖర్చు అవ్వనుంది. రూ.10 నోటు, రూ.20 నోటు తయారీకి రూ.2 నుంచి రూ.6 వరకు అవుతుందట. ఆర్బీఐ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా.. పలు రిపోర్ట్స్ ద్వారా ఈ విషయం తెలుస్తోంది.

5 / 5
ముద్రణకు ఎక్కువ ఖర్చు అయినా ఇవి ఎన్నో ఏళ్ల పాటు అలాగే ఉంటాయి. నీరు, తేమ, దుమ్ము వల్ల త్వరగా పాడవ్వడం జరగదు. దీని వల్ల నోట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. దీర్ఘకాలంలో నోట్ల ముద్రణ ఖర్చు తగ్గే అవకాశముంది. నోట్ల భద్రత, ఇతర అంశాలను పరీక్షించిన అనంతరం వచ్చే ఏడాదిలో వీటిని చలామణిలోకి తీసుకొస్తారు.

Follow Us