
గ్యా్స్ సిలిండర్ల కొరత క్రమంలో వినియోగదారులు అలర్ట్ అవుతున్నారు. చాలామంది ముందుగానే బుక్ చేసుకుని నిల్వ పెట్టుకోవాలని చూస్తున్నారు. రెండు సిలిండర్లను వాడేవారు మిగిలిన సిలిండర్‌ను రీఫిల్లింగ్ బుక్ చేస్తున్నారు. గ్యాస్ కొరత క్రమంలో ముందు జాగ్రత్తగా అందరూ బుక్ చేసుకుంటుండటంతో సర్వర్లు క్రాష్ అవుతున్నాయి. దీంతో వినియోగదారులు తొందరపడవద్దని, అందరికీ గ్యాస్ అందిస్తామంటూ కంపెనీలు చెబుతున్నాయి.

అయితే గ్యాస్ బుక్ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. యూపీఐ యాప్స్ ద్వారా, గ్యాస్ కంపెనీల వెబ్ సైట్, యాప్స్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇక గ్యా్స్ ఏజెన్సీ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా బుక్ చేసుకునే మార్గం ఉంది. అయితే ఇక వాట్సప్ విధానంలో కూడా గ్యా్స్ సిలిండర్ రీఫిల్లింగ్ కోసం మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.

మీరు ఇండేన్ గ్యాస్ వినియోగదారులు అయితే వాట్సప్ ద్వారా సులువుగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూటర్‌కు కాల్ లేదా కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా వాట్సప్ ద్వారా సెకన్లలోనే రిఫిల్లింగ్ కోసం అభ్యర్థన పెట్టవచ్చు. కేవలం వాట్సప్ నెంబర్‌కు మెస్సేజ్ పెట్టడం ద్వారా ప్రాసెస్ పూర్తవుతుంది.

ముందుగా ఫోన్‌లో ఇండేన్ వాట్సాప్ బుకింగ్ నంబర్ 7588888824ను సేవ్ చేసుకోండి. ఆ తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి ఆ నెంబర్‌కు రీఫిల్ అనే మెస్సేజ్ పెట్టండి. సిస్టమ్ ఆటోమేటిక్‌గా మీ వివరాలను ధృవీకరిస్తోంది. అనంతరం ఎల్పీజీ గ్యాస్ బుకింగ్ అవుతుంది. బుకింగ్ అయ్యాక వివరాలతో కూడిన మెస్సేజ్ మీకు వస్తుంది.

కొన్ని సెకన్లలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఇంటి నుంచి ఎప్పుడైనా బుకింగ్, తక్షణ కన్ఫర్మేషన్ మెస్సేజ్ వంటి సౌకర్యాలు వాట్సప్ బుకింగ్ ద్వారా పొందవచ్చు. అయితే ఈ సేవ కోసం మీరు ఎల్పీజీ కనెక్షన్‌తో మీ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకుని ఉండాలి. మీ నెంబర్ గ్యాస్ ఏజెన్సీ వద్ద రిజిస్టర్ అయి ఉండకపోతే వాట్సప్ ద్వారా బుక్ చేసుకోలేరు. దీంతో మీ డిస్ట్రిబ్యూటర్‌ను కాంటాక్ట్ అయి నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోండి.