Gold: మీ బంగారం అసలైనదో.. నకిలీదో ఇంట్లోనే సెకన్లలో తెలుసుకోవచ్చు.. 4 సింపుల్ ట్రిక్స్..

Updated on: Nov 02, 2026 | 7:57 AM

దీపావళికి చాలామంది బంగారం కొంటున్నారు. అయితే బంగారం కొన్నప్పుడు అది అసలైనదా.. నకిలీదా అనేది సులువగా తెలుసుకోవచ్చు. ఇంట్లోనే కొన్ని చిట్కాలతో సెకన్లలోనే తెలుసుకోవచ్చు. ఇందుకు నాలుగు మార్గాలు ఉన్నాయి. ఈ చిట్కాల ద్వారా మీరు ఇంట్లోనే తనిఖీ చేసుకోవచ్చు. అవేంటి అంటే..

1 / 5
దీపావళి పండుగ వస్తుండటంతో చాలామంది బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో గోల్డ్ షాపుల్లో కస్టమర్ల రద్దీ పెరుగుతోంది. ధరలు కూడా తగ్గుతుండటంతో షాపులకు గోల్డ్ ప్రియులు పరుగులు తీస్తున్నారు. దీపావళికి బంగారం కొంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో పాటు త్వరలో కార్తీక మాసం రానుండటంతో పెళ్లి సీజన్ మొదలుకానుంది. ప్రస్తుతం ధరలు పడిపోతుండటంతో ముందుగానే బంగారం కొని పెట్టుకుంటున్నారు.

2 / 5
ఈ దీపావళికి మీరు బంగారం కొంటుంటే.. అది అసలైన స్వచ్చమైన బంగారమా లేదా నకిలీ, నాసిరకందా? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల మీరు మోసానికి గురి కాకుండా ఉంటారు. మీరు ఇంట్లోనే బంగారం స్వచ్ఛతను సులువుగా తెలుసుకోవచ్చు. మీ ఇంట్లోనే ఉండే కొన్ని వస్తువులతో బంగారం క్వాలిటీని గుర్తించవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
పింగాణీ పాత్రలు ఉపయోగించి బంగారం స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. పింగాణీ పాత్రపై బంగారం రుద్దితే బంగారు గీత కనిపిస్తే అది స్వచ్చమైనదిగా చెప్పవచ్చు. ఒకవేళ ఇతర రంగుల గీతలు కనిపిస్తే అది కల్తీదని గమనించవచ్చు. ఇక వెనిగర్ సాయంతో కూడా బంగారం స్వచ్ఛతను తెలుసుకునే వీలుంది. బంగారంపై కొన్ని చుక్కల వెనిగర్ వేయాలి.

4 / 5
బంగారంపై వెనిగర్ వేస్తే రంగు మారదు. ఒకవేళ రంగు మారిందంటే కల్తీ బంగారంగా భావించవచ్చు. ఇక బంగారం ధరించిన తర్వాత మీ చర్మం ఆకుపచ్చ లేదా మరేదైనా రంగులోకి మారితే అది నకిలీదని చెప్పుకోవచ్చు. ఇక హాల్ మార్క్, హెచ్‌యూఐడీ నెంబర్ ఆధారంగా మీ బంగారం స్వచ్చతను  తెలుసుకోవచ్చు.

5 / 5
మీరు కొనే బంగారంపై బీఐఎస్ హాల్ మార్క్‌ గుర్తుతో పాటు నెంబర్ ఉండాలి. హెచ్‌యూఐడీ నెంబర్‌ను బీఐఎస్ కేర్ యాప్‌లోకి వెళ్లి నమోదు చేయాలి. దీంతో మీరు కొనే బంగారానికి సంబంధించిన వివరాలన్నీ కనిపిస్తాయి. దుకాణం పేరు, హాల్‌మార్క్ ఎప్పుడు నిర్వహించారనే సమాచారం తెలుసుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us