టాటా అల్ట్రోజ్ ఐసీఎన్జీ.. ఈ కారు ధర రూ. 10.02 లక్షలు ఉంది. ఇది ఆరు ట్రిమ్ లెవెల్స్ లో అందుబాటులో ఉంది. దీనిలో ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఫోర్ ట్వీటర్స్ లెదర్ స్టీరింగ్ వీల్, గేర్ కవర్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్.. వన్ టచ్ ఆటోమేటిక్ అప్ అండ్ డౌన్ డ్రైవర్స్ విండో, వైర్ లెస్ చార్జర్ వంటి ఫీచర్లు ఉంటాయి. అలాగే టాటా వారి ట్విన్ సిలెండర్ టెక్నాలజీని దీనిలో వినియోగించారు. 150 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.
మారుతీ సుజుకీ బ్రెజ్జా సీఎన్జీ.. ఈ కారులో మార్క్స్ కే15సీ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 87బీహెచ్ పీ పవర్, 121.5ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 60 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ అదనంగా ఉంటుంది. 328 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 9.14లక్షలు ఎక్స్ ఫోరూంగా ఉంది. అలాగే ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ12.05లక్షల వరకూ ఉంటుంది.
మారుతి సుజుకీ గ్రాండ్ విటారా సీఎన్జీ.. ఈ సీఎన్జీ వెర్షన్ కారు మిడ్ స్పెక్ డెల్టా, టాప్ స్పెక్ జీటా ట్రిమ్ లెవెల్స్ లో అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 12.85 లక్షలు ఎక్స్ షోరూం ఉంటుంది. దీనిలో బ్రెజ్జా వలే సేఫ్టీతో పాటు లగ్జరీ ఫీచర్లు ఉంటాయి. దీనిలో 373 బూట్ స్పేస్ ఉంటుంది.
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ సీఎన్జీ.. దీనిలో కే15సీ ఇంజిన్ ఉంటుంది. ఇది 86.61బీహెచ్ పీ, 121.5ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా మిడ్ స్పెక్ ఎస్, టాప్ స్పెక్ జీ ట్రిమ్ లెవెల్స్ ఉంటాయి. దీని ధర, ఇతర ఫీచర్లు కూడా గ్రాండ్ విటారా సీఎన్జీ మోడల్ లాగే ఉంటాయి.
టాటా టియాగో ఎన్ఆర్జీ సీఎన్జీ.. దీనిలో 73బీహెచ్పీ 95ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేసే ఇంజిన్ ఉంటుంది. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, కీలెస్ ఎంట్రీ, 15 అంగుళాల అల్లాయ్ వీల్స్, కూల్డ్ గ్లవ్ బాక్స్ ఉంటాయి. ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది.
హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్.. దీనిలో 67.72బీహెచ్ పీ, 95.2ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేసే ఇంజిన్ ఉంటుంది. ఇది పెట్రోల్, సీఎన్జీ రెండింటిపై పనిచేస్తుంది. దీని ధర రూ. 7.58లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. స్పోర్ట్స్ ట్రిమ్ ధర రూ. 8.13 లక్షలుగా ఉంటుంది. టియోగో లాగే బూట్ స్పేస్ ఉంటుంది. ఫ్రంట్ బంపర్ ని రీడిజైన్ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చారు.