Vande Bharat Express: తిరుపతికి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ.. ఎక్కడినుంచంటే..?

Updated on: Aug 08, 2026 | 5:52 PM

Indian Railways: తిరుమల వెళ్లేవారికి శుభవార్త. త్వరలో తిరుపతికి మరో వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వచ్చే అవకాశహుంది. ఈ మేరకు రైల్వేశాఖ ఇటీవల తిరుపతిలో ట్రయల్ రన్ నిర్వహించింది. తమిళనాడు నుంచి తిరుపతికి ఈ ట్రైన్ నడపనున్నారని తెలుస్తోంది. త్వరలో పూర్తి క్లారిటీ రానుంది.

1 / 5
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త అందించేందుకు సిద్దమవుతోంది. తిరుపతి మీదుగా ఇప్పటికే పలు వందే భారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. తిరుమలకు వేగంగా చేరుకునేందుకు ఈ రైళ్లు భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే త్వరలో తిరుపతికి మరో వందే భారత్ రైలు వచ్చే అవకాశముంది. తాజాగా ట్రయల్ రన్ కూడా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

2 / 5
ఇటీవల తిరుపతి రైల్వే స్టేషన్‌లో కొత్త వందే భారత్ రైలు కనిపించింది. రైల్వే స్టేషన్‌లోని ఫిట్ లైన్‌పై ఇది ఆగింది. ఈ రైలులో ముందు, వెనుక లోకో పైలట్లు తప్ప ఎవరూ కనిపించలేదు. మొత్తం ఎనిమిది కోచ్‌లు ఈ రైల్లో ఉండగా.. వైట్ అండ్ బ్లూ కలర్‌తో ఉంది. తమిళనాడు నుంచి తిరుపతికి వరకు ఈ రైలుకు ట్రయల్ రన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. తమిళనాడు వైపు నుంచి రేణిగుంట మీదుగా తిరుపతికి చేరుకుంది.

3 / 5
ట్రయల్ రన్స్‌లో భాగంగానే ఈ వందే భారత్ రైలు తిరుపతిలో ఆగినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ రైలు పట్టాలెక్కే అవకాశముందని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి రూట్ మ్యాప్ మాత్రం ఖరారు కాలేదు. తమిళనాడులోని శ్రీపెరంబదూరులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వందే భారత్ రైలును అభివృద్ది చేసినట్లు తెలుస్తోంది. ట్రయల్ రన్ కోసమే తిరుపతికి చేరుకున్నట్లు సమాచారం.

4 / 5
ప్రస్తుతం ఏపీ మీదుగా ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే వాటి సంఖ్య ఆరుకు చేరుకుంటుంది. అటు త్వరలో విశాఖపట్నం-బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సిద్దమవుతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ వివరాలు కూడా ఇటీవల బయటకొచ్చాయి. త్వరలోనే ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ అందుబాటులోకి రానుంది.

5 / 5
తమిళనాడు నుంచి తిరుపతికి ఈ రైలు నడపనున్నారని అనధికార సమాచారం. ట్రయల్ రన్ నిర్వహించడంతో త్వరలోనే పూర్తి వివరాలు బయటకొచ్చే అవకాశముంది. ప్రస్తుతం తమిళనాడు నుంచి తిరుపతికి వందే భారత్ ట్రైన్ లేదు. దీంతో ఈ రూట్లోనే ట్రయల్ రన్ జరపడంతో ఆ రెండు ప్రాంతాల మధ్య నడపనున్నారని తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us