
Gold Price Today: గత కొన్ని నెలలుగా దేశంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మధ్యప్రాచ్య సంఘర్షణను ముగించడానికి ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి గడువును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాయిదా వేయడంతో బంగారం, వెండి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ ఎగబాకుతోంది. తాజాగా మార్చి 27న బంగారం ధర 160 రూపాయలు పెరుగగా, 22 క్యారెట్ల 10 గ్రాములపై 150 వరకు పెరిగింది. ఇక వెండి మాత్రం భారీగా తగ్గింది. కిలో వెండిపై ఏకంగా 10 వేల రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది

ప్రస్తుతం బంగారం ధర పెరిగిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,700 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,650 ఉంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,08,530 వద్ద ట్రేడవుతోంది.

ఇక వెండి విషయానికొస్తే కిలోపై ఏకంగా 10 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. తగ్గిన తర్వాత కిలో వెండి ధర రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ కేజీ సిల్వర్ ధర 2,45,000 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

గత సెషన్‌లో దాదాపు 3% తగ్గిన తర్వాత, ఈరోజు కామెక్స్‌లో బంగారం ధరలు 0.33% పెరిగి ఔన్సుకు $4,423కి చేరుకున్నాయి. అదే సమయంలో శుక్రవారం ఆసియా ట్రేడింగ్‌లో కామెక్స్‌లో వెండి ధరలు 0.29% పెరిగి ఔన్సుకు $68.13కి చేరుకున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు, డాలర్ బలం, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లు, పారిశ్రామిక డిమాండ్, డాలర్ స్థానం, పెట్టుబడిదారుల డిమాండ్ ద్వారా బంగారం ధరలను నిర్ణయిస్తారు.