
Gold and Silver Rate: దేశీయ డిమాండ్, అస్థిర మార్కెట్ కదలికల మధ్య జనవరి 28 బుధవారం ఉదయం భారీ స్థాయిలో పెరిగాయి. ముఖ్యంగా పండుగలు, వివాహాల సమయంలో పెట్టుబడిదారులను, కొనుగోలుదారులను ఆకర్షిస్తాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.

ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 3,220 రూపాయల వరకు పెరుగగా, 22 క్యారెట్ల 10 గ్రాములపై 2,950 రూపాయల వరకు పెరిగింది.

ఉదయం 10.30 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,65,170 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,51,400 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి విషయానికొస్తే అందనంత ఎత్తుకు దూసుకుపోతోంది. కిలో వెండిపై ఏకంగా 10 వేల రూపాయల వరకు పెరిగి ప్రస్తుతం కిలో వెండి ధర 4 లక్షల రూపాయలకు చేరుకుంది.

అమెరికా డాలర్ బలహీనత కొనసాగుతుండటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గిస్తుందనే అంచనాల మధ్య అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు కూడా కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బంగారం, వెండి ఇప్పటివరకు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారు.