
సోమవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. వారం ప్రాంరభంలోనే ధరలు తగ్గడంతో కొనుగోలు చేసేవారికి శుభవార్త అందింది. పండుగ సీజన్ క్రమంలో గోల్డ్ కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ధరలు తగ్గడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ పతనం తర్వాత అక్టోబర్ 12న లెటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,980 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు ఒక్కరోజే రూ.440 మేర పడిపోయాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,38,400 వద్ద ట్రేడవుతోండగా.. ఇవాళ రూ.400 పతనమయ్యాయి. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,50,980గా ప్రస్తుతం ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,400 వద్ద కొనసాగుతున్నాయి. బెంగళూరులో కూడా 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర రూ.1,50,980 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,38,400 వద్ద ట్రేడవుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,130గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,550 వద్ద కొనసాగుతున్నాయి. అటు వెండి ధరలు మాత్రం సిర్థంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.2.40 లక్షల వద్ద ట్రేడవుతోంది.

హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.45 లక్షల వద్ద ట్రేడవుతోంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.2.45 లక్షల వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. బంగారం ధరల తగ్గుదలకు అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను మరింత పెంచనుందనే వార్తలే ఇందుకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.