బంగారం ధరలు మరోసారి భారీగా ఢమాల్.. ఈ రోజు ఒక్కసారిగా పతనం.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

Updated on: Nov 28, 2026 | 9:58 AM

Gold Prices: బంగారం, వెండి ధరలు శనివారం భారీగా తగ్గాయి. AI స్టాక్స్ పతనం, మార్జిన్ కాల్స్, అధిక ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. రాబోయే మూడు, నాలుగు వారాల పాటు ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

1 / 5
బంగారం, వెండి ధరలు దేశీయ మార్కెట్‌లో భారీగా పడిపోయాయి. సోమవారం నుంచి ధరలు పెరుగుతుండగా.. వారం చివరి రోజైన నవంబర్ 28వ తేదీన శనివారం పడిపోయాయి. గత రెండు వారాలుగా AI స్టాక్స్ భారీగా పతనమవడంతో.. మార్జిన్ కాల్స్‌ను కవర్ చేయడానికి హోల్‌సేల్ ఇన్వెస్టర్లు బంగారాన్ని విరివిగా విక్రయించారు. దీంతో పాటు అధిక ద్రవ్యోల్బణం కారణంతో ఫెడ్ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం కనిపిస్తుంది. ఈ కారణంతో ధరలు కుప్పకూలుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

2 / 5
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,860 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.540 మేర పెరిగాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,17,200 వద్ద ఉండగా.. నేడు రూ.500 మేర పుంజుకుంది. విజయవాడ. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

3 / 5
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,010 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,17,350కు లభిస్తోంది. చెన్నై, బెంగళూరులోనూ 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,27,860 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,17,200గా కొనసాగుతోంది.

4 / 5
వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1.70 లక్షల వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ కేజీ సిల్వర్ ధర రూ.1.70 లక్షలుగా ఉంది. నిన్న వెండి ధర రూ.5 వేలు పెరిగింది. ప్రస్తుతం అదే ధర వద్ద కొనసాగుతోంది.

5 / 5
అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ పతనంతో పెద్ద ఎత్తున హోల్‌సేల్ ఇన్వెస్టర్లు మార్జిన్ కాల్స్‌ను కవర్ చేసుకోవడానికి తమ బంగారాన్ని అమ్ముతున్నారు. స్టాక్ మార్కెట్‌లో నష్టాలను పూడ్చుకోవడానికి బంగారాన్ని విక్రయించడంతో పసిడిపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడి ధరలు పడిపోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ అస్థిరత డిసెంబర్ చివరి వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.  అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0.5 శాతం బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందంటున్నారు. ఇది కూడా బంగారం ధరలపై ప్రభావితం చూపిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us