
బంగారం, వెండి ధరల్లో్ ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఈ వారంలో గోల్డ్, సిల్వర్ రేట్లు స్ధిరంగా కొనసాగాయి. కొంచెం అటుఇటుగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ వారం మొత్తం చూస్తే గోల్డ్ రేట్లు పెరిగాయని చెప్పవచ్చు. ఎంత పెరిగాయనే విషయాలు చూద్దాం.

మార్చి 29వ తేదీన హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం రూ.1,48,090 వద్ద ఉండగా.. ఏప్రిల్ 4 నాటికి రూ.1,50,930కు చేరుకుంది. అంటే వారం రోజుల్లో రూ.2,840 పెరిగిందని చెప్పవచ్చు. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర 29న రూ.1,35,750 వద్ద ఉండగా.. శనివారం నాటికి రూ.1,38,350 వద్ద కొనసాగింది.

22 క్యారెట్ల బంగారంపై రూ.2600 పెరిగింది. ఇక చెన్నైలో 29న 24 క్యారెట్ల బంగారం రూ.1,49,020 వద్ద ఉండగా.. ఏప్రిల్ 4 నాటికి రూ.1,52,180 వద్ద ఉంది. దీంతో రూ.3160 పెరుగుదల నమోదైంది. ఇక ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,36,600 నుంచి రూ.1,39,500కి చేరుకుంది. అంటే రూ.2900 పెరిగింది.

ఇక ఢిల్లీలో మార్చి 29న 24 క్యారెట్ల బంగారం రూ.1,48,220 వద్ద ఉండగా.. రూ.1,51,080 వద్ద కొనసాగింది. దీంతో మొత్తం రూ.2960కి పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,35,900 నుంచి రూ.1,38,500కి చేరుకుంది. ఈ వారం మొత్తంలో చూస్తే బంగారం ధరలు పెరిగాయని చెప్పవచ్చు.

అటు ఆదివారం గోల్డ్ రేట్లు స్ధిరంగా కొనసాగుతున్నాయి. వారం రోజుల ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. నేడు 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,50,930 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,38,350 వద్ద కొనసాగుతోంది. అటు వెండి రేట్లు కూడా స్థిరంగా కొసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2.55 లక్షల వద్ద ట్రేడవుతోంది.