
బంగారం ధరలపై షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ధరలు భారీగా పెరిగాయి. గత మూడు రోజులుగా కొనసాగుతున్న తగ్గుదలకు బ్రేక్ పడినట్లయింది. గత కొద్ది రోజులుగా ధరలు పడిపోతుండటంతో కొనుగోలు చేసేవారు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ధరలు పెరగడంతో కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. గంటల వ్యవధిలోనే ధరలు తారుమారు అవ్వగా.. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

భారత బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం రూ.1,57,640 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే శుక్రవారం ఒక్కరోజే రూ.1580 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,44,500 వద్ద ట్రేడవుతోంది. నేడు ఒక్కరోజే రూ.1450 పెరిగిందని చెప్పవచ్చు. అయితే ప్రాంతాల వారీగా ధరల్లో వ్యత్యాసాలు అనేది ఉంటాయి. రాష్ట్రాలు విధించే ట్యాక్సులు, రవాణా ఖర్చుల వల్ల ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,57,640గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,44,500 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,280 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఒక్కరోజే రూ.1100 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1.46 లక్షలుగా ఉండగా.. శుక్రవారం రూ.వెయ్యి మేర పెరిగింది. బెంగళూరులో 24 క్యారెట్ల రేటు రూ.1,57,640గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,500గా కొనసాగుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,790 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,44,650గా ఉంది. అటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.80 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.75 లక్షల వద్ద స్థిరపడింది. ఇక హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.90 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.85 లక్షల వద్ద స్ధిరపడింది. చెన్నైలో శుక్రవారం రూ.2.90 లక్షల వద్ద కొనసాగుతోంది.

బంగారం ధరలు గత వారంలో స్వల్పంగానే పెరిగాయి. కానీ ఈ వారంలో మొన్నటివరకు తగ్గగా.. ఇప్పుడు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో రానున్న రోజుల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉంటాయనే చర్చ కొనసాగుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో ఇటీవల ధరలు దిగొచ్చాయి. డాలర్ బలం పుంచుకోవడం వల్ల ధరలు పడిపోయాయి.