
దేశంలో బంగారం ధరలు భారీగా పుంజుకుంటున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన క్రమంలో గోల్డ్ రేట్లల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లును పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో గోల్డ్ రేట్లు పడిపోతాయని అందరూ ఆశించగా.. సీన్ రివర్స్ అయింది. ధరలు మళ్లీ పెరుగుతూ వస్తుండటంతో కొనగోలుదారులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం సెప్టెంబర్ 18వ తేదీన తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,54,420 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.1580 పెరిగాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,41,550 వద్ద ట్రేడవుతుండగా.. నేడు రూ.1450 మేర పుంజుకున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,830 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,090గా కొనసాగుతున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,420 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,550గా కొనసాగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,570కు లభిస్తుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,41,700గా కొనసాగుతున్నాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,570గా ఉండగా.... 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,41,700 వద్ద ట్రేడవుతున్నాయి.

వెండి ధరలు కూడా శుక్రవారం రోజున భారీగా పెరిగాయి. కిలో వెండి రూ.2.50 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.45 లక్షల వద్ద స్థిరపడింది. ఇవాళ ఒక్కరోజే రూ.5 వేలు పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రూ.2,49,900గా ఉండగా.. నిన్న రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది.