
అత్యవసర సమయంలో డబ్బులు కావాలంటే బంగారాన్ని కుదువ పెట్టడం చాలా మందికి అలవాటు.

బంగారంపై ఋణం పొందటం సౌకర్యంగా ఉంటుంది. సాధారణంగా, ఇవి స్వల్పకాలిక రుణాలు, పదవీకాలం ఒక సంవత్సరం వరకు ఉంటుంది.

బంగారం ధరల్లో దిద్దుబాటు జరిగితే రుణగ్రహీతకు తక్కువ రుణ మొత్తం లభిస్తుంది. లోన్-టు-వాల్యూ (ఎల్‌టివి) నిష్పత్తిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) 75% వద్ద ఉంచింది.

బంగారం ధర తగ్గినపుడు తక్కువ రుణ మొత్తానికి ఎక్కువ బంగారం తాకట్టు పెట్టాల్సి వస్తుంది.

రుణాల కోసం కనీసం 18 క్యారెట్ల స్వచ్ఛత గలిగిన బంగారాన్ని మాత్రమే తీసుకుంటారు. అందులో రాళ్లు.. మలినాలు తీసేసి లెక్కకడతారు.