
బంగారం ధర ఒక్కసారిగా భారీగా పెరిగి షాకిచ్చింది. రికార్డులన్నీ బద్దలు కొట్టే దిశగా అడుగులు వేస్తోంది. రోజురోజుకి గోల్డ్ రేట్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. రాత్రికి రాత్రి ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. గోల్డ్, సిల్వర్ రేట్లు మరోసారి ఆల్ టైమ్ రికార్డ్ కొట్టబోతున్నాయనే సంకేతాలు ఇస్తున్నాయి. మంగళవారం మరోసారి గోల్డ్ రేట్లు చుక్కలు చూపించాయి.మంగళవారం పసిడి ధరలు వివిధ ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,280గా ఉంది. నిన్న రూ.1,46,240గా ఉండగా.. నిన్నటితో పోలిస్తే రూ.1040 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం రేటు రూ.1,35,000 వద్ద కొనసాగుతోంది. సోమవారం దీని ధర రూ.1,34,050 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.950 పెరిగింది.

విజయవాడ, విశాఖపట్నంలో కూడా 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,47,280 వద్ద ఉండగా..22 క్యారెట్ల ధర రూ.1,35,000గా ఉంది. ఇక చెన్నైలో బంగారం ధర భారీగా పెరిగింది. ఏకంగా రూ.1750 పెరిగి షాకిచ్చింది. చెన్నైలో నిన్న 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,46,730గా ఉండగా.. ఈ రోజుకి రూ.1,48,480కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,100 వద్ద కొనసాగుతోంది

ఇక బెంగళూరులో కేజీ వెండి ధర రూ.3,15,000 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.3,05,000గా ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధర రూ.10 వేలు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.3,30,000 వద్ద కొనసాగుతోంది.

నిన్న హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.3,18,000గా ఉంది. నిన్నటితో పోలిస్తే మంగళవారం రూ.12 వేలు పెరిగింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో కూడా వెండి ధర రూ.12 వేలు పెరిగింది.