Gold Prices Today: ఇవాళ ఒక్కరోజే రూ.9 వేలు.. సరికొత్త రికార్డ్ దిశగా బంగారం ధరలు.. వెండి కూడా జంప్..

Updated on: Dec 26, 2025 | 10:38 AM

బంగారం ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. తులం బంగారంపై రూ.800 మేర పెరగ్గా.. వెండి ధర రూ.9 వేల వరకు పెరిగింది. బంగారం ధర లక్షన్నర మార్క్‌కు చేరువలో ఉంది. త్వరలోనే లక్షన్నర మార్క్‌కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ వివిధ ప్రాంతాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

1 / 5
బంగారం, వెండి ధరలు మరోసారి రికార్డ్ దిశగా దూసుకెళ్తున్నాయి. మరోసారి లక్షా 40 వేల మార్క్‌కు చేరుకుంది గోల్డ్.  ఈ మార్క్‌కు గోల్డ్ రేటు చేసుకోవడం ఈ వారంలో ఇది రెండోసారి. ఈ వారం ప్రారంభం నుంచే బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరుగుతూ వస్తోన్నాయి. వేలకు వేలు పెరుగుతూ వస్తుండటంతో కొనుగోలుదారులకు భారంగా మారింది.  అసలు పండుగ సీజన్ కావడంతో ఈ ధరల పెరుగులతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు వెనకడుగు వేస్తున్నారు.

2 / 5
శుక్రవారం ఏకంగా తులం బంగారంపై రూ.770 పెరిగింది. హైదరాబాద్‌లో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,020కి చేరుకోగా.. నిన్న ఈ ధర రూ.1,39,251 వద్ద స్థిరపడింది. గురువారంతో పోలిస్తే శుక్రవారానికి రూ.770 పెరిగినందని చెప్పవచ్చు. ఇక 22 క్యారెట్ల బంగారంపై రూ.700 పెరిగింది. ఇవాళ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,28,350గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,27,650 వద్ద స్థిరపడింది.

3 / 5
ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగున్నాయి. అటు చెన్నైలో ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,620గా ఉండగా.. నిన్నటితో పోలిస్తే రూ.760 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర చెన్నైలో రూ.1,28,900గా ఉంది. నిన్నటితో పోలిస్తే దీని ధర రూ.700 పెరిగిందని చెప్పవచ్చు.

4 / 5
ఇవాళ బెంగళూరులో కూడా గోల్డ్ రేట్లల్లో మార్పులు జరిగాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,020గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.770 మేర పెరిగింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,40,170 వద్ద ఇప్పుడు కొనసాగుతోంది. అటు 22 క్యారెట్ల ధర రూ.1,28,500 వద్ద ఉంది.

5 / 5
ఇక వెండి ధర అయితే ఏకంగా నిన్నటితో పోలిస్తే ఢిల్లీ రూ.6 వేలు పెరిగింది. గురువారం ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,34,000గా ఉండగా... ఇవాళ రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.9 వేలు పెరిగింది. గురువారం రూ.2,45,000గా ఉండగా.. శుక్రవారం రూ.2,54,000కి చేరుకుంది.