
బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల వల్ల పసిడి ధరలు పెరుగుతాయని అందరూ ఊహించారు. గోల్డ్ రేటు రూ.2 లక్షలకు చేరుకుంటాయని, వెండి ధరలు రూ.4 లక్షలకు చేరుకోవచ్చనే అంచనాలు వెలువడ్డాయి. కానీ అందుకు భిన్నంగా పసిడి ధరలు పతనమవుతున్నాయి. గత మూడు రోజులుగా ధరలు భారీగా కుప్పకూలుతూ వస్తోన్నాయి. బుధవారం బంగారం ధరలు మరోసారి పడిపోయాయి.

ఇవాళ ఒక్కరోజే బంగారం ధర రూ.3 వేలకుపైగా డౌన్ అయింది. ఈ తగ్గింపు తర్వాత హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,64,510 వద్ద కొనసాగుతోంది. మంగళవారం ఈ ధర రూ.1,67,620 వద్ద స్థిరపడగా.. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.3,110 తగ్గముఖం పట్టింది.

అటు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,50,800 వద్ద ట్రేడవుతోంది. నిన్న ఈ ధర రూ.1,53,650గా ఉండగా.. ఇవాళ రూ.2850 మేర తగ్గిందని చెప్పవచ్చు. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో 24 క్యారెట్లు చూస్తే రూ.1,65,820గా ఉండగా.. 22 క్యారెట్లు రూ.1,52,000గా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,64, 510గా ఉండగా. .22 క్యారెట్ల రేటు రూ.1,50,800 వద్ద కొనసాగుతోంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,64,660 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,50,950 వద్ద ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.3 వేల మేర ధరలు తగ్గాయి.

Gold