Gold Price: ఇరాన్ యుద్ధం వేళ బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోతున్నాయి? ఓహో అసలు కారణాలు ఇవేనా?

Updated on: Apr 08, 2026 | 6:00 AM

Gold, Silver Prices: ఇటీవల నుంచి బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పడిపోతున్నాయి. ఇరాన్ యుద్ధం జరుగుతున్న వేళ పెరగాల్సిన బంగారం, వెండి ధరలు తగ్గిపోవడానికి అసలు కారణాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంత యుద్ధం జరుగుతున్నా ధరలు ఎందుకు పడిపోతున్నాయో తెలుసుకుందాం..

1 / 6
 Gold Price: సాధారణంగా ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని 'సురక్షితమైన పెట్టుబడి' (Safe Haven)గా భావిస్తారు. కానీ ప్రస్తుత ఇరాన్ సంక్షోభంలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. రికార్డు స్థాయి గరిష్టాల తర్వాత బంగారం, వెండి ధరలు అకస్మాత్తుగా 22% పడిపోవడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.

2 / 6
 ధరల పతనానికి ప్రధాన కారణాలు: డాలర్ వైపు మొగ్గు: యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి అనిశ్చిత స్థితిలో పెట్టుబడిదారులు బంగారం కంటే అమెరికన్ డాలర్, బాండ్లపై ఎక్కువ నమ్మకం ఉంచుతున్నారు. ఇది బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమైంది.

3 / 6
 పారిశ్రామిక డిమాండ్ తగ్గడం: వెండి వినియోగంలో 60% పరిశ్రమల నుంచే ఉంటుంది. యుద్ధం వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థ (Supply Chain) దెబ్బతినడంతో పారిశ్రామికంగా వెండికి డిమాండ్ తగ్గింది. ఫలితంగా బంగారం కంటే వెండి ధరల్లోనే భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.

4 / 6
Gold Rate

Gold Rate

5 / 6
 ప్రాఫిట్ బుకింగ్: 2025లో బంగారం 75%, వెండి 165% లాభాలను అందించాయి. ఇప్పుడు పెద్ద ట్రేడర్లు తమ లాభాలను నగదుగా మార్చుకోవడానికి అమ్మకాలు జరపడంతో మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.

6 / 6
 నిపుణుల హెచ్చరిక: 2025లో చూసిన అసాధారణమైన పెరుగుదల మళ్ళీ ఇప్పట్లో కనిపించడం కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం ముగిసి, పరిస్థితులు చక్కబడే వరకు మార్కెట్ ఏ దిశలో వెళ్తుందో చెప్పలేమని, కొత్త పెట్టుబడిదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Follow Us