Gold Rates: రూ.11 వేలు తగ్గిన బంగారం.. కొనుగోలు చేసేవారికి భారీ శుభవార్త.. ఇదే మంచి ఛాన్స్

Updated on: Mar 22, 2026 | 2:37 PM

బంగారం, వెండి ధరలు ఈ వారంలో గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. డాలర్ బలపడటం వల్ల పసిడి ధరలు పడిపోతున్నాయి. ప్రస్తుతం 24 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,45,970 వద్ద ఉండగా..22 క్యారెట్ల ధర రూ.1,33,800 వద్ద కొనసాగుతోంది.

1 / 5
డాలర్ బలపడటం, ఫెడ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి, అంతర్జాతీయ ఉద్రిక్తతల క్రమంలో గోల్డ్ రేట్లలో తగ్గుదల నమోదవుతోంది. ఈ వారంలో బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా గోల్డ్ రేట్లు పడిపోగా.. వచ్చే వారంలో కూడా భారీగా కుప్పకూలే అవకాశముంది. ఈ వారం పొడవునా బంగారం ధరలు పతనమవ్వగా.. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశాలున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి

2 / 5
ప్రపంచ మార్కెట్లను ప్రస్తుతం ఒక వింతైన భయం వెంటాడుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం ముదురుతున్న వేళ, ఆర్థిక సూత్రాలకు భిన్నంగా విలువైన లోహాల ధరలు కుప్పకూలడం గ్లోబల్ ఇన్వెస్టర్లను ఉలిక్కిపడేలా చేసింది. సాధారణంగా యుద్ధం వచ్చినప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతాయి. కానీ, మార్చి 23, 2026 నాటి గణాంకాల ప్రకారం, కేవలం 3 గంటల వ్యవధిలోనే బంగారం, వెండి మార్కెట్ క్యాప్ నుండి $2 ట్రిలియన్లు తుడిచిపెట్టుకుపోయాయి. యుద్ధం జరుగుతున్నప్పుడు, చమురు ధరలు (Oil Prices) పెరుగుతున్నప్పుడు ఇలా జరగడం గతంలో ఎన్నడూ లేని ఒక అరుదైన, వింతైన పరిణామం.

3 / 5
గత వారంతో పోలిస్తే ఈ వారంలో పసిడి ధరలు గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో సాధారణంగా గోల్డ్ రేట్లు పెరుగుతాయి. కానీ డాలర్ బలపడటం, మార్కెట్ల అస్థిరత, పెట్టుబడిదారులు నగదు అవసరాల కారణంగా బంగారాన్ని విక్రయించారు. దీని వల్ల గోల్డ్ రేట్లు తగ్గాయి

4 / 5
డాలర్ బలపడటం బంగారం డిమాండ్‌ను తగ్గించింది. ఇక ఫెడ్ వడ్డీ రేట్లను సవరిస్తుందనే భయాలు ఒత్తిడిని పెంచాయి. ఇక పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ పెట్టుబడిదారలు లాభాలను పొందారు. ఇక యుద్ద పరిస్థితుల క్రమంలో ముడి చమురు ధరలు పెరగడం ద్రవ్యోల్బణం భయాలను పెంచింది. బంగారం ధరల పతనానికి ఇవే కారణంగా చెప్పవచ్చు. ఈ వారంలో బంగారం ధరలు రూ.11 వేలు తగ్గాయి.

5 / 5
ఇక వెండి ధరలు కూడా కుప్పకూలాయి. మార్చి 13న కిలో సిల్వర్ రూ.2,60,488 వద్ద ఉండగా.. మార్చి 20 నాటికి రూ.2,32,364కి తగ్గిపోయింది. ఈ వారంలో మొత్తం రూ.28 వేల మేర క్రాష్ అయింది. బంగారంతో పోలిస్తే సిల్వర్ ధరల తగ్గుదల ఎక్కువగా ఉంది. ఆర్ధిక అనిశ్చితి వల్ల ధరలు తగ్గాయని చెప్పవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us