EV Car: బెంజ్ కంపెనీ బంపర్ బొనాంజా.. 800 కిలోమీటర్ల మైలేజ్‌తో కొత్త ఈవీ కారు లాంచ్

Updated on: Jun 22, 2025 | 12:00 PM

భారతదేశంలో మెర్సిడెస్-బెంజ్ ఈక్యూఎస్ లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్‌కు సంబంధించిన ప్రత్యేక ఎడిషన్ ఈక్యూఎస్ 580 సెలబ్రేషన్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ కారు ధర రూ. 1.30 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది పరిమిత శ్రేణి మోడల్. అలాగే దేశవ్యాప్తంగా 50 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. భారతదేశంలోనే అత్యంత పొడవైన శ్రేణి ఎలక్ట్రిక్ కారుగా ఈ కారు నిలిచింది. ఈ నేపథ్యంలో మెర్సిడెస్-బెంజ్ ఈక్యూఎస్ 580 సెలబ్రేషన్ ఎడిషన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

1 / 5
ఈ ప్రత్యేక ఈక్యూఎస్ 580 డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లతో కూడిన 107.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుంది. ఈ సెటప్ 544 బీహెచ్‌పీ, 858 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

2 / 5
ఇది ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. కేవలం 4.3 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 817 కి.మీ.ల రేంజ్‌ను అందిస్తుంది.

3 / 5
7.4 కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 11 నుంచి 17 గంటల మధ్య సమయం పడుతుంది అయితే 200 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 31 నిమిషాల్లోనే 80 శాతం వరకు చార్జ్ అవుతుంది.

4 / 5
ఇది వెనుక సీటు కంఫర్ట్ ప్యాకేజీతో వస్తుంది. మసాజ్ ఫంక్షన్లతో మల్టీ-కాంటూర్ సీట్లు, లంబర్ సపోర్ట్, 38 డిగ్రీల వరకు రిక్లైనింగ్‌ను అందిస్తుంది. ఇది డాష్‌బోర్డ్‌లో ట్రిపుల్ స్క్రీన్ సెటప్‌ను, వెనుక సీటు ఎంటర్టైన్మెంట్ డ్యూయల్ 11.6-అంగుళాల రియర్ డిస్ప్లేలతో పాటు 7-అంగుళాల టాబ్లెట్‌ను పొందుతుంది. ఇది ప్రీమియం నప్పా లెదర్ సీట్లు, డిజైనర్ సీట్‌బెల్ట్ బకిల్స్‌తో ఆకట్టుకుంటుంది.

5 / 5
ప్రకాశవంతమైన ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, వెనుక వైపు ఫుల్ లైట్ బార్‌ను కలిగి ఉంది. ఈ కారు 5,216 ఎంఎం పొడవు, 2,125 ఎంఎం వెడల్పు, 1,521 ఎంఎం ఎత్తు, 3,210 ఎంఎం వీల్‌బేస్, 124 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఉంటుంది.