
ప్రస్తుతం లేఆఫ్స్, పెరుగుతున్న ధరలు, మార్కెట్ ఒడిదుడుకులు సాధారణ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఆర్థిక స్థితిని మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా ఈ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొవచ్చు.

ఎమర్జెన్సీ ఫండ్.. సాధారణంగా 3–6 నెలల ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఉంచాలని సూచిస్తారు. కానీ అనిశ్చితి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నిధిని మరింత పెంచడం మంచిది. ఇది లాభాల కోసం కాకుండా భద్రత కోసం ఉపయోగపడుతుంది. ఉద్యోగం కోల్పోవడం లేదా వైద్య అత్యవసర పరిస్థితుల్లో అప్పుల నుంచి రక్షిస్తుంది.

అనవసర ఖర్చులపై నియంత్రణ.. చిన్న చిన్న ఖర్చులు కూడా పెద్ద మొత్తంగా మారుతాయి. ఉపయోగించని సబ్‌స్క్రిప్షన్లు, అవసరం లేని ఆన్‌లైన్ షాపింగ్ వంటి వాటిని తగ్గించడం ద్వారా నెలవారీ పొదుపు పెరుగుతుంది. ఇది కఠినమైన పొదుపు కంటే సులభమైన మార్గం.

ఆదాయ వనరుల విస్తరణ.. ఒకే ఆదాయ వనరుపై ఆధారపడటం ప్రమాదకరం. సైడ్ బిజినెస్ లేదా పార్ట్‌టైమ్ స్కిల్ ద్వారా అదనపు ఆదాయం పొందేలా ప్రయత్నించడం మంచిది. ఇది ఆర్థిక భద్రతను పెంచుతుంది.

అప్పుల భారాన్ని తగ్గించడం.. అధిక వడ్డీ ఉన్న అప్పులు (ప్రత్యేకంగా క్రెడిట్ కార్డ్ బకాయిలు) త్వరగా తీర్చడం అవసరం. EMI భారం తగ్గితే చేతిలో మిగిలే నగదు పెరుగుతుంది, ఇది ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది.