EV Cars: 2024లో మార్కెట్‌ను ముంచెత్తనున్న ఈవీ కార్లు.. షాకింగ్‌ ఫీచర్లతో లాంచ్‌

| Edited By: Ravi Kiran

Nov 04, 2023 | 8:25 AM

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు జోరు పెరుగుతుంది. 2024లో టాప్‌ కంపెనీలతో పాటు స్టార్టప్‌లు కూడా అనేక ఈవీలు లాంచ్‌ చేయనున్నాయి. భారత మార్కెట్‌లో ఇప్పటీకే ఈవీ స్కూటర్ల జోరు పెరిగింది. అయితే మైలేజ్‌ విషయంలో అనుమానాలతో చాలా మంది ఇప్పటికీ ఈవీ కార్లవైపు చూడడం లేదు. కాబట్టి అన్ని కంపెనీలు ఫీచర్లతో పాటు మైలేజ్‌ దృష్టిలో పెట్టుకుని ఈవీలు లాంచ్‌ చేయనున్నాయి. 2024లో భారత మార్కెట్‌లో హల్‌చల్‌ చేయనున్న ఈవీ కార్లపై ఓ లుక్కేద్దాం.

1 / 5
స్వదేశీ వాహన తయారీ సంస్థ మహీంద్రా కూడా భారతదేశంలో ఈవీ మార్కెట్ వాటాలో కొంత భాగాన్ని కోరుకుంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీ రిలీజ్‌ చేసిన ఎక్స్‌యూవీ 400 విక్రయాల్లో టాప్‌లో ఉంది. అయితే 2024లో మహీంద్రా ఎక్స్‌యూవీ 700కు సంబంధించిన ఎలక్ట్రిక్ వెర్షన్‌ని ఎక్స్‌యూవీఈ8ను రిలీజ్‌ చేసే అవకాశం ఉంది. ఈ కారు 80 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌తో రెండు మోటార్లు, ఒక్కో యాక్సిల్‌కు ఒకటి శక్తినిస్తుంది.

2 / 5
స్కోడా ఎన్యాక్ ఐవీ  భారతదేశంలో కార్ల తయారీదారు సంబంధించి మొదటి ఈవీ లాంచ్‌ చేయనుంది. ఇది 2024 మధ్యలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. స్కోడా ఎన్యాక్‌ ఐవీ 77 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌తో రెండు మోటార్‌లతో రావడం వల్ల ఒకే ఛార్జ్‌పై 500కిమీ పరిధి ఇస్తుందని అంచనా. ఎన్యాక్ ఐవీ ఈవీ 2సీబీయూ భారతదేశంలోని ఈవీ కార్ల ప్రియులు ఆసక్తి చూపుతున్నారు.

3 / 5
సిట్రియోన్‌ ఈసీ3 ప్రారంభించిన తర్వాత ఫ్రెంచ్ కార్‌మేకర్ ఆల్-ఎలక్ట్రిక్ ఈసీ3 ఎయిర్‌క్రాస్‌ను పరిచయం చేయాలని చూస్తోంది. ఇది ఈసీ3కు సంబంధింఇన 29.2 కేడబ్ల్యూహెచ్‌ ప్యాక్‌తో పోలిస్తే పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అలాగే సీ3 ఎయిర్‌క్రాస్ మాదిరిగానే ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ 2024లో ఎప్పుడైనా ప్రారంభించినప్పుడు 5 లేదా 7-సీటర్లలో  వస్తుందని అంచనా వేస్తున్నారు.

4 / 5
టాటా నెక్సాన్ ఈవీ భారతీయ మార్కెట్‌లో విజయవంతం కావడంతో భారతదేశంలో టాటా  ఈవీ పోర్ట్‌ఫోలియో పెరిగింది. ఈ నేపథ్యంలో 2024లో టాటా హారియర్ ఈవీ లాంచ్‌ కానుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. హారియర్ ఈవీ లాంచ్ 2024 ద్వితీయార్థంలో జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే హారియర్‌ ఈవీ 500 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని అంచనా వేస్తున్నారు.

5 / 5
మారుతి సుజుకి ఈవీఎక్స్‌ ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఈ కారు మారుతీ సుజుకీ మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారు. ఇది టయోటాతో కలిసి అభివృద్ధి చేశారు. అలాగే ఇటీవల ముగిసిన జపాన్ ఆటో షోలో కూడా ఈ కార్‌ను ప్రదర్శించారు. ఈ కారును ప్రస్తుతం రహస్యంగా పరీక్షిస్తున్నారు. మారుతి సుజుకి 2024 చివరిలో ఈవీఎక్స్‌ లాంచ్ చేస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నారు.