
బ్యాంకులు వినియోగదారుల కోసం కొత్త కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. బ్యాంకులు తమ తమ క్రెడిట్ కార్డులను యూపీఐయాప్‌తో లింక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.

దేశంలోని మూడు అగ్ర బ్యాంకుల బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్ కార్డ్‌లను జూన్, 2023 వరకు UPI యాప్‌లతో లింక్ చేయలేరు.

ఈ మూడు బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్. ఈ మూడు బ్యాంకుల కస్టమర్‌లు తమ క్రెడిట్ కార్డ్‌లను తమ యూపీఐ ఐడీలతో మార్చి, 2023 నాటికి లింక్ చేసుకునే అవకాశం కల్పిస్తామని బ్యాంకులు తెలిపాయి.

సాంకేతిక కారణాల వల్ల, కస్టమర్‌లు ఈ ఏడాది జూన్ నుంచి మాత్రమే ఈ ఫీచర్‌ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులు ఎంపిక చేసిన UPI యాప్‌లలో ఈ ఫీచర్‌ను పొందవచ్చు.

BHIM, Mobikwik, Paytm యాప్‌లతో మాత్రమే UPI లావాదేవీలు చేయడానికి ఈ నాలుగు బ్యాంకుల ఖాతాదారులు తమ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించవచ్చు.