
సొంత ఇల్లు కలిగి ఉండటం ప్రతి ఒక్కరి కల. అద్దె ఇళ్లలో నివసించే వారికి సొంత ఇల్లు ఉండాలనే కోరిక ఉంటుంది. అయితే చాలా మంది నిల్లు నిర్మించుకోవడానికి, లేదా కొనుగోలు చేయడానికి బ్యాంకుల లోను తీసుకుంటూ ఉంటారు. అలా లోన్ తీసుకొని ఇల్లు కొనాలి, కట్టుకొవాలి అని ఆలోచిస్తున్న వారికి ఓ గుడ్‌న్యూస్. అతి తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మీరు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి దాదాపు 30 సంవత్సరాల టైమ్ పిరియడ్‌తో హోమ్ లోన్ తీసుకోవచ్చు. దీని ప్రాసెసింగ్ ఫీజు రూ.20,000 కంటే తక్కువ. దీనిలో బ్యాంకు ఉద్యోగస్తులకు ఇంటి విలువలో 90 శాతం వరకు రుణాలు అందించగలదు. వ్యాపారం చేసే వ్యక్తులకు ఇంటి విలువలో 80 శాతం వరకు రుణాలు ఇస్తారు. ఇక్కడ గృహ రుణాలు సంవత్సరానికి 7.35 శాతం వడ్డీ రేటుతో అందుబాటులో ఉన్నాయి.

బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి గృహ రుణం తీసుకుంటుంటే, మీకు 30 సంవత్సరాల కాలానికి రుణం లభిస్తుంది. మీరు రూ.5 కోట్ల వరకు రుణం తీసుకోవచ్చు. ఈ బ్యాంక్ మీ ఆస్తి విలువలో 90 శాతం వరకు రుణం ఇస్తుంది. వడ్డీ రేటు సంవత్సరానికి 7.35 శాతం వరకు ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గృహ రుణ కాలపరిమితి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీ రేటు సంవత్సరానికి 7.10 శాతం నుండి ప్రారంభమవుతుంది. ఇది మంచి CIBIL స్కోరు ఉన్న కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. చాలా సందర్భాలలో, ఈ బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయదు. మహిళా కస్టమర్లు, రక్షణ సిబ్బంది కూడా వడ్డీ రేటుపై అదనంగా 0.05 శాతం తగ్గింపు పొందవచ్చు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణం 7.35 శాతం వార్షిక వడ్డీ రేటుకు లభిస్తుంది. దీనిని 30 సంవత్సరాల కాలానికి తీసుకోవచ్చు. ఈ రుణాన్ని ఇంటి కొనుగోలు, ఇంటి పునరుద్ధరణ లేదా మరమ్మత్తు కోసం ఉపయోగించవచ్చు. బ్యాంకు ఇంటి ధరలో 90 శాతం వరకు రుణాలను అందిస్తుంది. ఇది ప్రధానమంత్రి గృహనిర్మాణ పథకానికి కూడా మద్దతు ఇస్తుంది.