EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం శుభవార్త.. మరో బిగ్ అప్డేట్ వచ్చేసింది..

Updated on: Feb 03, 2026 | 2:05 PM

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్రం తీపికబురు అందించింది. ఈపీఎఫ్‌వో 3.0పై రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది. వివరాలు అప్డేట్, బదిలీల ప్రక్రియను సులభతరం చేసినట్లు తెలిపింది. ఇక పెన్షన్ డబ్బులు ఈజీగా పొందేలా పలు మార్పులు చేసింది. ఈ మేరకు కేంద్రం వివరాలు బయటపెట్టింది.

1 / 5
ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఇక నుంచి పీఎఫ్ ఖాతాలోని డబ్బులను సులువుగా ఉపసంహరించుకునే సౌకర్యాన్ని కల్పించనున్నట్లు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న ఈపీఎఫ్‌వో 3.0 అప్డేట్‌లో పీఎఫ్ నిధుల విత్ డ్రా గతంలో కంటే సులభం, వేగంగా మారుతుందని స్పష్టం చేసింది. అలాగే ఆన్లైన్ క్లెయిమ్‌లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.

2 / 5
గతంలో ఈపీఎఫ్ క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకున్న తర్వాత నగదు అకౌంట్లో జమ కావడానికి 8 రోజుల వరకు టైమ్ పట్టేదని రాజ్యసభకు కేంద్రం వివరించింది. సమాచారం సరిగ్గా ఉండి కేవైసీ పూర్తైతే వారం రోజుల్లో జమ అయ్యేవని తెలిపింది. అయితే 2025-26 ఆర్ధిక సంవత్సరంలో ఈపీఎఫ్ క్లెయిమ్స్‌లో పెరిగినట్లు గణంకాలు విడుదల చేసింది. గత నెల జనవరి 23వ తేదీ వరకు 85.33 మిలియన్లకుపైగా క్లెయిమ్స్ ప్రాసెస్ అయ్యానని పేర్కొంది

3 / 5
గత సంవత్సరంతో పోలిస్తే క్లెయిమ్స్ ఎక్కువగా జరిగాయని, ప్రాసెస్ వేగవంతంగా, సమర్థవంతంగా జరుగుతుందని చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శమని రాజ్యసభలో కేంద్రం వివరించింది.ఈపీఎఫ్‌వో 3.0 వల్ల యాజమాన్యం ఆమోదం లేకపోయినా ఆన్‌లైన్‌లో పీఎఫ్ నగదు బదిలీ క్లెయిమ్ చేసుకోవచ్చు. తరచుగా ఉద్యోగాలు మారేవారికి లేదా మాజీ యజమానిని సంప్రదించలేనివారికి దీని వల్ల ప్రయోజనం చేకూరుతోంది.

4 / 5
ఇక ఈపీఎఫ్‌ 3.0లో ప్రొఫైల్ కరెక్షన్ ప్రక్రియను ఉద్యోగులు సులభంగా చేసుకోవచ్చు. జనవరి 2025 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఉద్యోగులు పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని స్వయంగా మార్చుకోవచ్చు. గతంలో ఇందుకోసం కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే సులువుగా అప్డేట్ చేసుకోవచ్చు.

5 / 5
ఇక ఈఫీఎఫ్‌వో 3.0లో భాగంగా పెన్షన్ వ్యవస్థలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. పెన్షనర్లు ఇకపై ఓ నిర్ధిష్ట బ్యాంకు లేదా శాఖపై ఆధారపడాల్సిన అవసరం లేదు. దేశంలోనే ఏదైనా షెడ్యూల్డ్ బ్యాంకు నుంచి పెన్షన్ పొందవచ్చు. వృద్ద పెన్షనర్లకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది.  ఇక ఈపీఎఫ్‌వో 3.0లో మెంబర్ పాస్‌బుక్ లైట్ ఫీచర్ జొడించారు. దీని వల్ల పీఎఫ్ పాస్‌బుక్ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు.