1 / 5
మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ఈ నెలలోనే మార్కెట్‌లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహీంద్రా ఎస్‌యూవీ కార్ల అమ్మకాలను తగ్గించింది. ఎక్స్‌యూవీ 300 కొత్త గ్రిల్‌తో రీ-డిజైన్ చేసిన బంపర్లు, ఫ్రంట్ ఫేసియా ఆకర్షిస్తుంది. డీఆర్‌ఎల్‌లతో సిట్ ఎల్ఈడీ హెడ్‌లైట్లతో పాటు వెనుక వైపు కొత్త టెయిల్ గేట్ డిజైన్, రీ-డిజైన్ చేసిన బంపర్స్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. సైడ్లలో కొత్తగా డిజైన్ చేసిన 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఈ కారును మరింత ఆకట్టుకునేలా చేస్తాయి.