పీపీఎఫ్ నిధులను ఇన్‌కమ్ ట్యాక్స్ జప్తు చేయవచ్చా..? ఈ రూల్స్ చాలామందికి తెలియదు..

Updated on: Nov 02, 2026 | 12:42 PM

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం గురించి అందరికీ తెలిసిందే. ఈ పథకంలో కోట్లాదిమంది పెట్టుబడులు పెడుతున్నాయి. ఇందులో పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించకపోతే పీపీఎఫ్ నిధుల నుంచి వసూలు చేయవచ్చా? దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

1 / 5
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పొదుపు ఖాతాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) ఒకటి. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో నడిచే ఈ స్మాల్ సేవింగ్స్ అకౌంట్లో చాలామంది పెట్టుబడులు పెడుతుంటారు. బ్యాంక్ ఫిక్స్‌డ్  డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు ఇందులో పొందవచ్చు. దీంతో ట్యాక్స్ పొదుపు చేసుకోవడానికి ఇదొక మార్గంగా చెప్పవచ్చు. చాలామంది ఉద్యోగులు, వ్యాపారులు తమ ఆదాయపు పన్ను మినహాయింపులు పొందేందుకు పీపీఎఫ్ పథకంలో చేరుతుంటారు.

2 / 5
ఒకవేళ ఇన్‌కమ్ ట్యాక్స్ బకాయిలు ఉంటే ఆదాయపు పన్ను శాఖ పీపీఎఫ్ నిధుల నుంచి వాటికి తీసుకోవచ్చా? మీ పీపీఎఫ్ సొమ్మును జప్తు చేయవచ్చా? అనే ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి. మీ ట్యాక్స్ సకాలంలో చెల్లించకపోతే ఆదాయపు పన్ను శాఖ రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే పీపీఎఫ్ నిధుల నుంచి వసూలు చేయటానికి నిబంధనలు అంగీకరించవు. ఆ నిబంధనల వల్ల మీ పీపీఎఫ్ నిధులను జప్తు చేయడం కుదరదు. పీపీఎఫ్‌లో జమ చేసే డిపాజిట్లకు వీటి నుంచి రక్షణ ఉంటుంది. దీంతో ఐటీశాఖ జప్తు చేయడం వీలుకాదు.

3 / 5
అయితే పీపీఎఫ్ నిధులు విత్ డ్రా చేసుకుని వాటిని సేవింగ్స్ అకౌంట్లో చేస్తే నిబంధనలు వేరుగా ఉంటాయి. ఇలాంటి సమయంలో ఐటీ శాఖ జప్తు చేసే అవకాశాలు ఉంటాయి. మీరు పీపీఎఫ్ నుంచి విత్ డ్రా చేసుకున్న నిధుల నుంచి ట్యాక్స్‌ను ఐటీ శాఖ వసూలు చేయవచ్చు. పీపీఎఫ్‌లో అమౌంట్ ఉన్నంతవరకు మాత్రమే రక్షణ అనేది ఉంటుంది.

4 / 5
ఐటీ శాఖ ఇతర ఆస్తుల నుంచి రికవరీ చేసుకునేందుకు నిబంధనలు అంగీకరిస్తాయి. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లు, శాలరీ, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, ఇతర స్థిరచరాస్తుల నుంచి రికవరీ చేయవచ్చు. దీంతో మీకు ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వచ్చే దానిని విస్మరించకూడదు. నియమాల ప్రకారం అప్పీల్‌కు వెళ్లవచ్చు. అలాగే నోటీస్ వెనక్కి తీసుకోవాల్సిందిగా దరఖాస్తు  దాఖలు చేయవచ్చు.

5 / 5
ఒకవేళ మీ పీపీఎఫ్ అకౌంట్ స్తంభింపచేసినట్లు బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌ మీకు తెలియచేస్తే ముందుగా కారణం తెలుస్తుంది. వారి ఆర్డర్‌ను కాపీ తీసి పెట్టుకోండి, పీపీఎఫ్ అకౌంట్ స్టేట్‌మెంట్, పన్ను డిమాండ్ నోటీస్,రికవరీ ఆర్డర్ భద్రపర్చుకోండి. అభ్యంతరం వ్యక్తం చేస్తూ దరఖాస్తు దాఖలు చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us