Silver: వెండి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త.. ఈ విషయం తెలుసుకోకపోతే మీకే నష్టం.. చాలామంది ఇది పట్టించుకోరు..
వెండి ఆభరణాలు లేదా ప్రతిమలు కొనుగోలు చేస్తున్నారా.. అయితే అలర్ట్. బంగారానికి ఉన్నట్లు వెండికి కూడా స్వచ్చత ఉంటుంది. వెండిలో ఏడు రకాల గ్రేడుల్లో స్వచ్చత కొలుస్తారు. దీంతో మీరు కొనుగోలు చేసేముందు ఏ గ్రేడ్ స్వచ్చత కలిగిన వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారనేది చెక్ చేసుకోవాలి.
బంగారం కొనుగోలు చేసేటప్పుడు 24 క్యారెట్లు, 22 క్యారెట్లను చూస్తూ ఉంటాం. దీంతో పాటు 999,916 స్వచ్చత, బీఐఎస్ హాల్ మార్క్ తనిఖీ చేస్తాం. అయితే వెండి కొనుగోలు చేసేటప్పుడు చాలామంది దాని స్వచ్చత గురించి ఆలోచించరు. సిల్వర్‌లో స్వచ్చతకు సంబంధించి ఏడు రకాల గ్రేడ్లు ఉన్నాయి. వీటి గురించి చాలామంది అవగాహన లేక కొనుగోలు చేసేటప్పుడు మోసపోతున్నారు. వెండిని కొనుగోలు చేస్తుంటే ఏయే అంశాలు పరిశీలించాలనేది చూద్దాం.
వెండి ఆభరణాలు, ప్రతిమలకు 999,990,970,958,835,800 గ్రేడుల్లో స్వచ్చతను గుర్తించవచ్చు. కిలో వెండి అంటే 999 స్వచ్చతతో కూడుకున్నదని అర్థం చేసుకోవాలి. వెండి కొనుగోలు చేసేముందు ఆ రోజు కిలో వెండి ధర ప్రకారం గ్రాముకు ఇంత పడుతుందని చెబుతారు. కానీ స్వచ్చత గురించి చెప్పరు. దీని వల్ల మీరు మోసపోయే ప్రమాదముంది. దీంతో కొనుగోల చేసేముందు ధర కాకుండా దాని స్వచ్చత గురించి ముందు తెలుసుకోకపోతే నష్టపోతారని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా 925, 835, 800 స్వచ్చత గల వెండిని విక్రయిస్తున్నారు. 925 అంటే 92.5 శాతం, 835 అంటే 83.5 శాతం, 800 అంటే 80 శాతం వెండి ఉంటుంది. ఉదాహరణకు మీరు కొనే రోజు 999 స్వచ్చత గల కిలో వెండి రేటు రూ.2.50 లక్షలకు ఉందనుకుందాం. అదే 925 స్వచ్చత గల వెండి రేటు మరింత తక్కువగా ఉంటుంది. అంటే రూ.2,31,250 మాత్రమే ఉంటుంది. స్వచ్చతను బట్టి దాని ధర ఉంటుందని మర్చిపోకండి.
వెండికి కూడా కేంద్ర ప్రభుత్వం హాల్ మార్కింగ్ నిబంధన తప్పనిసరి చేసింది. 2025 సెప్టెంబర్ 1 నుంచి వెండికి కూడా హాల్ మార్కింగ్ చేస్తున్నారు. దీంతో వెండి కొనుగోలు చేసేముందు 6 అంకెల హెచ్‌యూఐడీ చెక్ చేసుకోండి. దీని ద్వారా వెండి స్వచ్చతను తెలుసుకోవడం వల్ల నష్టపోకుండా ఉంటారు. చాలామందికి ఈ విషయం తెలియక నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు
గత ఏడాదిలో 77 లక్షల వెండి వస్తువులకు హాల్ మార్కింగ్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2024-25లో 32 లక్షల వెండి వస్తువులకు పూర్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాలు ఇందులో ముందు వరుసలో ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో 62 శాతం వెండి ఉత్పత్తులకు హాల్ మార్కింగ్ పూర్తి చేశారు. హాల్ మార్కింగ్ ప్రకియ కోసం దేశంలో 25 వేలమందికిపైగా వ్యాపారులు నమోదు చేసుకున్నారు. దేశంలోని 102 జిల్లాల్లో హాల్ మార్కింగ్ కేంద్రాలు ఉన్నాయి.