Bank Holidays: బిగ్ అలర్ట్.. మంగళవారం బ్యాంకులన్నీ మూతపడతాయా..?

Updated on: Jan 26, 2026 | 9:47 PM

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. రేపు బ్యాంకులన్నీ మూసివేయనున్నాయి. బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించాయి. ఈ కారణంతో మంగళవారం బ్యాంకులన్నీ క్లోజ్ కానున్నాయి. బ్యాంకింగ్ వినియోగదారులు ముందుగానే ఈ విషయాన్ని తెలుసుకుని జాగ్రత్ర పడాలని కస్టమర్లకు బ్యాంకులు మెస్సేజ్‌లు పంపుతున్నాయి.

1 / 5
బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ మూతపడనున్నాయి. బ్యాంకు సంఘాలు మంగళవారం బంద్‌ చేపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ బంద్ జరగనుంది. వారానికి ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలంటూ బ్యాంకు ఉద్యోగులు రేపు విధులు బహిష్కరించి నిరసన చేపట్టనున్నాయి.

2 / 5
బ్యాంకులు మూతపడనుండటంతో చెక్కుల క్లియరెన్స్ వంటి సేవలు నిలిచిపోతున్నాయి. ఇక యూపీఐ, నెట్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలు యథావిధిగా పనిచేస్తాయి. బ్యాంక్ సేవల్లో అంతరాయం కలిగే అవకాశముందని బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు మెస్సేజ్‌లు పంపుతున్నాయి.

3 / 5
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంక్ ఉద్యోగులు ఈ సమ్మె చేపడుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులు కూడా ఈ బంద్‌లో పాల్గొంటున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులన్నీ క్లోజ్ కానున్నాయి. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులు అందించాయి.

4 / 5
మార్చి 2024లో ఐదు రోజుల వర్కింగ్ డేస్‌పై ఇండియన్ బ్యాంకింగ్ అసోషియేషన్, బ్యాంక్ సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది. దీనికి ప్రాధమికంగా ఆమోదం లభించినప్పటికీ.. ఇంకా తుది నిర్ణయం ఆర్బీఐ, కేంద్ర ఆర్దికశాఖ తీసుకోలేదు. దీంతో దీని అమలుపై  ఏడాదిగా బ్యాంక్ సంఘాలు నిరసన చేపడుతున్నాయి. అయితే ప్రభుత్వం స్పందించడం లేదు.

5 / 5
కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆందోళనలను తీవ్రతరం చేయాలని బ్యాంక్ సంఘాలు నిర్ణయించాయి. అందులో భాగంగా సమ్మెకు దిగుతున్నాయి. ప్రస్తుతం బ్యాంకుల్లో 2,4వ శనివారాల్లో సెలవులు అమల్లో ఉన్నాయి. నెలలో మిగిలిన శనివారాల్లో కూడా సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.