Bank Holidays: వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఖాతాదారులకు అలర్ట్..

Updated on: Nov 29, 2026 | 7:19 AM

బ్యాంకులతో ప్రతీఒక్క ఖాతాదారుడికి పని ఉంటుంది. బ్యాంక్ సెలవు రోజుల్లో కొన్ని సేవలు నిలిచిపోతాయి. దీంతో ప్రతీ వారం బ్యాంక్ హాలీడేస్ గురించి తెలుసుకోవాలి. మీరు బ్యాంక్ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని చూస్తుంటే వచ్చే వారం బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోండి.

1 / 5
ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు మన అరచేతిలోకి వచ్చేశాయి. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే చాలావరకు ఆర్థిక లావాదేవీలను నిర్వహించుకునే అవకాశం ఉంది. అయితే నగదు  డిపాజిట్లు, పెద్ద మొత్తంలో నగదు విత్ డ్రాలు, రుణ పత్రాల ప్రాసెసింగ్, చెక్కుల క్లియరెన్స్ లేదా మరేదైనా ప్రత్యేకమైన బ్యాంకు పనుల కోసం బ్యాంకు శాఖలను సందర్శించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వారు ప్రతీ వారం బ్యాంక్ సెలవుల జాబితాపై అవగాహన కలిగి ఉండాల్సి ఉంటుంది.

2 / 5
బ్యాంక్ సెలవుల గురించి ముందుగానే తెలుసుకోవడం ద్వారా తమ పనులను ముందుగానే ప్రణాళిక చేసుకోవచ్చు. దీని వల్ల సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. వచ్చే వారం బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోవాల్సిన అవసరముంది. రాష్ట్రాలను బట్టి సెలవులు మారుతుంటాయి. దీంతో మీ ప్రాంతంలోని ప్రాంతీయ సెలవులు తెలుసుకోండి.

3 / 5
నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 5 వరకు సెలవుల జాబితా చూస్తే.. డిసెంబర్ 1వ తేదీన అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇక డిసెంబర్ 3వ తేదీన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ సందర్బంగా గోవాలో బ్యాంకులు ఉండవ్. డిసెంబర్ 6వ తేదీన ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి.

4 / 5
ప్రతీ నెలా రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సాధారణ సెలవు. దీంతో ప్రతీ వారం బ్యాంక్ సెలవుల్లో మార్పులు ఉంటాయి. ఈ కారణంతో ప్రతీ వారంలో బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోవాలి. ఆర్బీఐ విడుదల చేసే క్యాలెండర్ ప్రకారం బ్యాంక్ సెలవులు ఉంటాయి. ప్రాంతీయ సెలవుల ఆధారంగా ఆర్బీఐ హాలీడే క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. ప్రాంతీయ సెలవులు కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి.

5 / 5
సెలవు రోజుల్లో బ్యాంకు శాఖలు మూసిఉన్నప్పటికీ.. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. దీంతో UPI, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATMల ద్వారా  లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. NEFT, RTGS నిధులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. సెలవుల కారణంగా చెక్కు క్లియరెన్స్, పత్రాల భౌతిక ధృవీకరణ, డిమాండ్ డ్రాఫ్ట్‌లు బంద్ అవుతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us