
కొబ్బరన్నం కోసం కావాల్సిన పదార్థాలు: రెండు కప్పులు బియ్యం, ఒక కప్పు కొబ్బరి తురుము, రెండు టేబుల్ సూన్స్ నెయ్యి, రెండు టేబుల్ స్పూన్స్ నూనె , నాలుగు పచ్చిమిర్చి, కరివేపాకు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, జీడిపప్పు , ఎండుమిర్చి , రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

కొబ్బరన్నం తయారీ విధానం: ముందుగా అన్నం వండుకోవాలి. పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి. ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, శనగపప్పు, అర టేబుల్ స్పూన్ మినపప్పు, 10 జీడిపప్పు వేసి వేయించాలి. ఆ తరువాత నాలుగు ఎండుమిర్చి, మూడు పచ్చిమిర్చి, నాలుగు కరివేపాకులు కూడా దీనిలో వేయాలి.

ఇక చివర్లో తురిమిన కొబ్బరి వేసి 10 నిమిషాల పాటు ఉంచి బాగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో ఉప్పు కూడా వేసి చివర్లో అన్నం కూడా కలిపి బాగా మిక్స్ చేయాలి. అంతే వేడి వేడి కొబ్బరన్నం రెడీ. అయితే, దీనిలోకి కోడికూర అదిరిపోతోంది. దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

కోడికూర కోసం కావాల్సిన పదార్థాలు: అర కిలో చికెన్, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు , రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , రెండు టేబుల్ స్పూన్స్ కారం , ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా , అర టేబుల్ స్పూన్ పసుపు , కొబ్బరి పాలు అర కప్పు నూనె, రుచికి తగినంత ఉప్పు , కొత్తిమీరను కూడా దీనిలో వేసుకోవాలి.

కుక్కర్లో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ , టమాటాలు వేసి ఒక టేబుల్ స్పూన్ కారం, పసుపు, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు కూడా దీనిలో బాగా కలుపుకోవాలి. ఇంకా చికెన్ కూడా దీనిలో వేసి మసాలాలు పట్టేలా యించాలి. ఇంకా నీరు పోసి చికెన్ ఉడికే వరకు ఉడికించాలి. చివర్లో కొత్తిమీర వేసి దించుకోవాలి. కొబ్బరన్నంతో కమ్మని కోడికూర తింటే ఆ రుచే వేరు.