వారానికి మూడు సార్లు తాగితే చాలు.. ఈ గంజే మీకు అమృతం అవుద్దీ

Updated on: Jul 14, 2026 | 4:04 PM

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు . అందుకే తప్పకుండా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఎలాంటి వ్యాధులైనా సరే తగ్గిపోవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా ఈ గంజి తాగలంట.

1 / 5
కందిపప్పు, రాగితో కలిపి గంజి తయారు చేసుకొని తాగలంట. దీనిని ప్రతి రోజూ ఉదయం తాగడం వలన ఇది శరీరం బరువు తగ్గడానికి సహాయపడుతుంది అంతే కాకుండా డయాబెటీస్ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందేలా చేస్తుంది. కాగా, మంచి పోషకాలు ఉన్న ఈ గంజిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

2 / 5
కావాల్సిన పదార్థాలు : మెంతులు, కందిపప్పు, నీరు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, రాగి పిండి, నీరు, ఉప్పు, తురిమిన కొబ్బరి తరుగు, జీలకర్ర, నీరు, నూనె, ఉల్లిపాయలు, ఎండు మిరపకాయలు. ఈ పదార్థాలతో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చును.

3 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మెంతులు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి, నానబెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పు, కూడా శుభ్రం చేసి మంచిగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత వీటిని ఉడకబెట్టుకోవాలి. ఇవి ఒక వైపు బాగా ఉడుకుతుండగానే, మరొక వైపు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టాలి.

4 / 5
ఆ పాన్‌లో నీళ్ళు పోసి, రాగిపిండి వేసి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి, రాగి పిండి మంచిగా ఉడికి, చిక్క బడుతున్న సమయంలో, అందులో ఈ ఉడికిన పప్పు, మెంతుల మిశ్రమం వేసుకొని మరోపదినిమిషాల పాటు మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇవి ఎంత బాగా ఉడికితే, అంత రుచికరంగా ఉంటుంది.

5 / 5
ఇప్పుడు, మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర, కొబ్బరి తురుము, నీళ్లు పోసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాగిపిండిలో కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, అందులో నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత దానిలో ఉల్లిపాయలు, జీలకర్ర అన్నీ వేసి ,పోపు పెట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రాగి కందిపప్పు గంజి రెడీ.

Follow Us