
ఈ మధ్య కాలంలో జిమ్‌కు వెళ్లడం అనేది ట్రెండ్ అయిపోయింది. చాలా మంది బరువు తగ్గడం కోసమో, లేదా ఫిట్‌గా కనిపించడం కోసం జిమ్‌కు వెళ్తున్నారు. కానీ కొందరు రోజూ జిమ్‌కు వెళ్తున్న వాళ్లలో ఎలాంటి మార్పులు కనిపించవు ఇందుకు ప్రధాన కారణం జిమ్ కు వెళ్లే ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియక పోవడం.

అవును జిమ్‌కు వెళ్లే 15-20 నిమిషాల ముందు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అవి మన శక్తితో పాటు కండరాల పెరుగుదలకు దోహదపడుతాయి. మీకు రోజూ జిమ్‌కు వెళ్లే అలవాటు ఉంటే.. వర్కౌట్స్ చేయడానికి ముందు మీకు అవసరమైన పరిమాణంలో ఓట్స్ తినండి. ఇందులో పాలు, డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం ద్వారా మీరు మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.

ఓట్స్ వంటి ఆహార పదార్థాలను జిమ్‌కు వెళ్లే ముందు తినడం వల్ల శరీరానికి నెమ్మదిగా కార్బోహైడ్రేట్లు లభిస్తాయి, ఇది దీర్ఘకాలిక వ్యాయామాన్ని సులభతరం చేస్తుంది. ఇది వ్యయామం చేసే సమయంలో మీ శక్తిని పెంచుతుంది. అలాగే కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది.

వీటితో పాటు మీరు ప్రీ వర్కౌట్‌గా ఉడికించిన చిలకడదుంప, బ్లాక్‌టీని కూడా తీసుకొవచ్చు. అంతే కాకుండా కొన్ని తృణధాన్యాలు తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి అవసమైన పోషకాలు లభిస్తాయి. చాలా మంది ప్రోటిన్ షేక్ కూడా తీసుకుంటారు. అయితే దీన్ని జిమ్‌కు వెళ్లే అరగంట ముందే తీసుకోవాలి. దీనిని నీటిలో కలిపి తీసుకోవడం ఉత్తమం.

జిమ్‌కు వెళ్లే వారికి గుడ్లు కూడా చాలా బాగా ఉపయోగపడుతాయి. వీటిని తినడం వల్ల మనకు అవసరమైన ప్రోటిన్ లభిస్తుంది. అయితే కొందరు జిమ్‌కు వెళ్లిన వెంటనే వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ అది చాలా తప్పు.. మొదట మీరు నార్మల్‌గా స్ట్రిచ్చింగ్ చేసి ఆ తర్వాత వ్యాయమాలు చేయడం స్టార్ట్ చేయండి. అలాగే జిమ్ ట్రైనర్‌ల సహాలతో మాత్రమే వర్కౌట్ చేయండి.