3 / 5
జోజోబా ఆయిల్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఈ నూనెలో విటమిన్ ఇ, బి కాంప్లెక్స్ ఉంటాయి. జోజోబా నూనెను జిడ్డుగల చర్మానికి కూడా అప్లై చేయవచ్చు. ఇది చర్మం అదనపు నూనెల ఉత్పత్తిని నియంత్రిస్తుంది. జొజోబా నూనెను సున్నితమైన చర్మానికి కూడా అప్లై చేయవచ్చు. అర్గాన్ ఆయిల్‌ని 'లిక్విడ్ గోల్డ్' అని అంటారు. ఈ నూనెలో కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఆర్గాన్ ఆయిల్ చర్మానికి తేమను అందించడంతో పాటు యాంటీ ఏజింగ్ ఇంగ్రిడియంట్‌గా పనిచేస్తుంది.