Eye Care: బైక్ నడిపే ప్రతి ఒక్కరూ ఇవి తెలుసుకోవాల్సిందే.. లేదంటే మీ కళ్లు డేంజర్‌లో పడొచ్చు!

Updated on: Nov 28, 2026 | 9:52 AM

చాలా మంది బైక్‌పై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు. దీని కారణంగా గాలిలోని దుమ్ము, ధూళి మొత్తం వారి కళ్లలోకి చేరుతుంది. కానీ చాలా మంది వాటిని అస్సలు పట్టించుకోరు. కళ్లను కనీసం సరిగ్గా శుభ్రం చేసుకోరు. ఇది కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీయొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నోయిడాలోని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఆప్తాల్మాలజిస్ట్ డాక్టర్ దీపాంజలి ఆర్య ప్రకారం.. ప్రతిరోజూ బైక్‌పై ప్రయాణించేవారు తమ కళ్లను రక్షించుకోవడానికి ఐదు ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అవేంటో చూద్దాం.

1 / 5
మీ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం.. కళ్లను చేతులతో రుద్దకూడదు. ముఖ్యంగా డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఈ పని అస్సలు చేయకూడదు. ఎందుకంటే బైక్‌పై ప్రయాణించేటప్పుడు దుమ్ము, చిన్న చిన్న ధూళి కణాలు కళ్లపై లేదా కనురెప్పల కిందకు చేరుతాయి. అలాంటప్పుడు కళ్లను చేతులతో గట్టిగా రుద్దితే కార్నియా పొర దెబ్బతినే ప్రమాదం ఉంది. మీ కళ్లలో ఏదైనా పడినట్లు అనిపిస్తే వెంటనే బైక్‌ను పక్కకు ఆపి, శుభ్రమైన నీటితో కళ్లను సున్నితంగా కడుక్కోవాలి.

2 / 5
అయితే కళ్లను కడిగే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లను శుభ్రం చేసుకోవడానికి రోజ్ వాటర్, ఇంట్లో తయారు చేసిన మిశ్రమాలు లేదా ఇతర నాటు చిట్కాలను ఉపయోగించకూడదు. కడిగిన తర్వాత కూడా మంట, దురద లేదా చికాకు తగ్గకపోతే కంటి వైద్యుడిని సంప్రదించాలి. కళ్లలో ధూళి కణాలు చిక్కుకుపోయాయా లేదా కార్నియాకు గాయమైందా అనే విషయాన్ని వైద్యులు పరీక్షిస్తారు. అవసరమైతే కళ్లలో పొడిబారడం, చికాకు తగ్గించేందుకు లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ ఉపయోగపడతాయి.

3 / 5
మరో విషయం.. బైక్‌పై వేగంగా వెళ్లేటప్పుడు గాలి కారణంగా కళ్లపై ఉండే కన్నీటి పొర దెబ్బతిని, కళ్లు పొడిబారడం, అలసట, నీరు కారడం వంటి సమస్యలు రావచ్చు. ఇలాంటి లక్షణాలు తరచూ కనిపిస్తే ప్రిజర్వేటివ్ లేని లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ వాడొచ్చు. అలాగే సహజంగా కళ్లు రెప్పలు ఆర్పుతూ ఉండాలి. ఎక్కువ సమయం ప్రయాణిస్తే కాసేపు కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి.

4 / 5
మీ కళ్లు బాగా ఎర్రబడినా, వాటి నుంచి నీరు కారుతున్నా ఈ సమస్యలను తేలికగా తీసుకోవద్దు. కళ్లలో నిరంతర నొప్పి, చూపు మసకబారడం, కాంతిని చూడలేకపోవడం, అధికంగా కన్నీళ్లు రావడం, కళ్లలో ఏదో ఉన్నట్లుగా అనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటి సమస్యలు కనిపిస్తే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి.

5 / 5
మీ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన సైజులో ఉండే హెల్మెట్, సరిగ్గా పనిచేసే వైజర్ వాడాలి. దీనివల్ల దుమ్ము, ధూళి, గాలి నుంచి మీ కళ్లను రక్షించుకోవచ్చు. అలాగే హెల్మెట్ వైజర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. బైక్ నడిపేటప్పుడు రోడ్డుపై స్పష్టంగా కనిపించేలా, చూపునకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తపడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us