వాటర్ ట్యాంక్‌లో వీటిని వేస్తే నాచు అనేదే ఉండదు.. పూర్వీకుల నేచురల్ ట్రిక్.. నిమిషాల్లోనే అంతా క్లీన్..

Updated on: May 01, 2026 | 3:09 PM

నేటి ఆధునిక కాలంలో ప్రతి ఇంట్లోనూ పైన ఒక నీటి ట్యాంక్ ఉండటం సర్వసాధారణం. కానీ ఆ ట్యాంక్ నిర్వహణ విషయానికి వస్తే మాత్రం చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కొద్దిరోజులు గడవగానే ట్యాంక్ గోడలకు పచ్చని నాచు, అడుగున పేరుకుపోయే బూజు నీటిని కలుషితం చేస్తాయి. ఈ నీటితో స్నానం చేస్తే చర్మ సమస్యలు, జుట్టు రాలడం వంటివి ఎదురవుతాయి. అయితే ఇంటి చిట్కాలతోనే ట్యాంక్‌ను తలతలలాడేలా మెరిపించడం ఎలాగో తెలుసుకుందాం..

1 / 5
నాచు పట్టడానికి అసలు కారణం ఏమిటి?: నీటి ట్యాంకుల్లో నాచు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి.  ట్యాంక్ మూత సరిగ్గా లేకపోయినా లేదా పారదర్శకంగా ఉన్నా, సూర్యకాంతి లోపలికి సోకి కిరణజన్య సంయోగక్రియ ద్వారా నాచు వేగంగా పెరుగుతుంది. నీరు ఎక్కువ కాలం కదలకుండా ఒకే చోట నిల్వ ఉంటే బ్యాక్టీరియా చేరి మురికి పేరుకుపోతుంది.

2 / 5
పూర్వీకుల రహస్యం: గ్రామాల్లో పాతకాలంలో బావులు, చెరువుల్లో నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండేది. దానికి కారణం వారు వాడే కొన్ని సహజసిద్ధమైన వృక్ష రకాలు.  నేరెడు లేదా అడవి నేరెడు పుల్లలు సహజమైన యాంటీ-మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. వీటిని ట్యాంక్‌లో వేయడం వల్ల అవి నీటిలోని ఆక్సిజన్ స్థాయిని సమతుల్యం చేస్తాయి. నాచు పెరగకుండా అడ్డుకుంటాయి. ట్యాంక్ అడుగున ఒక చిన్న రాగి ముక్కను వేయడం వల్ల ఒలిగోడైనమిక్ ప్రభావం ఏర్పడుతుంది. ఇది నీటిలోని హానికర బ్యాక్టీరియాను చంపేస్తుంది.

3 / 5
ట్యాంక్‌ను క్లీన్ చేయడానికి పక్కా ప్రణాళిక: ట్యాంక్‌ను శుభ్రం చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అని చాలామంది వాయిదా వేస్తుంటారు. ముందుగా ట్యాంక్ లోని నీటిని పూర్తిగా తీసేయాలి. అడుగున ఉన్న బురదను తొలగించాలి. ఒక బకెట్ లో బేకింగ్ సోడా, వెనిగర్, కొద్దిగా డిటర్జెంట్ కలపండి. బేకింగ్ సోడా మొండి మరకలను వదిలిస్తే, వెనిగర్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

4 / 5
గోనె సంచి ట్రిక్: ట్యాంక్ లోపలికి దిగడం ప్రమాదకరం అనుకుంటే, ఒక పొడవైన వెదురు కర్రకు పాత గోనె సంచిని గట్టిగా కట్టండి. దానిని పైన చెప్పిన మిశ్రమంలో ముంచి ట్యాంక్ లోపల మూలమూలలా రుద్దండి. గోనె సంచికున్న గరుకుదనం వల్ల నాచు సులభంగా ఊడి వచ్చేస్తుంది. అత్యంత మొండిగా ఉన్న చోట కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ వాడవచ్చు, కానీ కడిగేటప్పుడు కనీసం 3-4 సార్లు మంచి నీటితో ఫ్లష్ చేయాలి.

5 / 5
భవిష్యత్తులో నాచు పట్టకుండా ఉండాలంటే?: కేవలం శుభ్రం చేస్తే సరిపోదు, మళ్లీ నాచు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ట్యాంక్ బయటి వైపు నలుపు రంగు వేసి, దాని పైన తెలుపు రంగు వేయడం వల్ల సూర్యకాంతి లోపలికి వెళ్లదు. దీనివల్ల నాచు పెరగదు. అంతేకాకుండా ట్యాంక్ మూత ఎప్పుడూ గాలి చొరబడనంత టైట్‌గా ఉండాలి. గాలి, వెలుతురు లేకపోతే నాచు బతకలేదు. ఒకవేళ ట్యాంక్ పెద్దదైతే, అప్పుడప్పుడు కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ కలపడం వల్ల అది ఆల్గేను నిర్మూలిస్తుంది. ఇది నీటిలో కలిసినా పెద్దగా హాని చేయదు.

Follow Us